Begin typing your search above and press return to search.
ట్రైలర్ టాక్: తాప్సీ కెరియర్లో తొలి హిట్టే
By: Tupaki Desk | 9 Aug 2016 12:43 PM GMT'నువ్వు వర్జిన్ వా'' అని అడుగుతాడు లాయర్ అమితాబ్ బచ్చన్. 'నో' అంటుంది తాప్సీ. పింక్ మూవీ ట్రైలర్ ఓపెనింగ్ ఇది. ఓ కోర్ట్ సీన్ లో ఇలాంటి డెప్త్ ఉన్న క్వశ్చన్ ఆన్సర్ లతో ట్రైలర్ ను స్టార్ట్ చేశారంటేనే.. పింక్ కాన్సెప్ట్ ఎన్ని లోతులను టచ్ చేస్తుందో అర్ధమవుతుంది.
ముగ్గురు అమ్మాయిలను వేధింపులకు గురి చేస్తారు కుర్రాళ్లు. దీంతో వాగడం మానేసి వచ్చి ఏం చేస్తావో చెయ్యి చూస్తా అంటుంది తాప్సి పన్ను. ఆ తర్వాత ఆ కుర్రాళ్లలో ఒకడు చనిపోవడంతో.. అంతా మర్డర్ కేసులో ఇరుక్కుపోతారు. ఈ సిట్యుయేషన్ లో అవతలి కుర్రాళ్ల తరపున వాదించేందుకు వస్తాడు అమితాబ్ బచ్చన్. బిగ్ బీ పాత్రలోనే కాదు.. తాప్సీ రోల్ లో ఇంకా ఎక్కువ వేరియేషన్స్ కనిపిస్తున్నాయి.
ట్రైలర్ లో ప్రతీ ఫ్రేమ్ విజువల్ గా ఆకట్టుకుంటుంది. ఆ మర్డర్ ఏంటి? అందులో ఎలా వీళ్లెలా ఇరుక్కున్నారు? సాక్ష్యాలన్నీ బలంగా ఉన్న ఈ కేసు చివరకు ఏమైంది?లాంటివాటికి పింక్ మూవీనే ఆన్సర్ ఇస్తుంది. కానీ పింక్ తో తాప్సీ చాలా స్ట్రాంగ్ మెసేజ్ ఇస్తోంది. తను హిట్ కొట్టేస్తున్నాననే కాన్ఫిడెన్స్ అమ్మడి కళ్లలో కనిపించింది. మూవీ కూడా అంతే ప్రామిసింగ్ గా ఉంది.
నిజానికి ఇలాంటి కాన్సెప్ట్ తో శ్రీ మహాలక్ష్మి అంటూ శ్రీహరి ఓ మూవీ చేశాడు. కోర్టు సీన్లతో సహా ఆ సినిమా అన్ని విషయాల్లోనూ బాగా నాటుగా అనిపిస్తుంది కానీ.. పింక్ మాత్రం ట్రైలర్ తోనే ఆకట్టుకుంటోంది.