Begin typing your search above and press return to search.

నేనే తాప్సీ అనడం కష్టమేమో

By:  Tupaki Desk   |   31 March 2017 7:34 AM GMT
నేనే తాప్సీ అనడం కష్టమేమో
X
ఢిల్లీ బ్యూటీ తాప్సీ పన్ను కొన్ని నెలలుగా మాంచి జోరు మీదుంది. అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటించిన పింక్ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలవడమే కాకుండా.. తాప్సీకి బోలెడన్ని ప్రశంసలు తెచ్చిపెట్టింది. దీంతో ఆకాశమే హద్దు అన్నట్లుగా కూడా మాట్లాడేసింది. బేబీకి ప్రీక్వెల్ గా తెరకెక్కిన నామ్ షబానా అనే ఫిమేల్ సెంట్రిక్ మూవీ చేస్తుండడంతో.. అమ్మడి స్పీడ్ మరింతగా పెరిగింది.

నామ్ షబానా రిలీజ్ ఇవాళే కానీ.. ఇప్పటికే క్రిటిక్స్ రివ్యూలు రేటింగులు వచ్చేశాయి. ప్రీమియర్లు చూసిన జనాలు సినిమాను తెగ విమర్శించేస్తున్నారు. తాప్సీ కష్టపడిందనే ఒక్క మాట తప్ప.. స్టోరీ.. స్క్రీప్ట్.. ఇలా ప్రతీ విషయానికి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో నామ్ షబానా నిలబడ్డం కష్టమే అనే టాక్ వినిపిస్తోంది. ఫిబ్రవరిలో తాప్సీ హీరోయిన్ గా వచ్చిన రన్నింగ్ షాదీ బంపర్ డిజాస్టర్ గా నిలిచినా.. ఈమె పట్టించుకోలేదు. కారణం ఈ అమ్మడి ఆశలన్నీ షబానా పైనే ఉండడమే.

కానీ తెలుగులో నేనే షబానా అంటూ రిలీజ్ అయిన ఈ చిత్రంపై.. అప్పుడు ఆశలు అడుగంటిపోయిన పరిస్థితి. ఇలాంటి సిట్యుయేషన్ లో నేనే తాప్సీ అన్నట్లుగా అతి ధీమాతో తాప్సీ డైలాగ్స్ చెప్పడం.. సినిమా లైఫ్ ఇచ్చిన ఇండస్ట్రీలపై విమర్శలు చేయడం ఇకపై కష్టం కావచ్చేమో!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/