Begin typing your search above and press return to search.
రష్మి రాకెట్ ట్రైలర్: స్త్రీత్వం.. లింగ వివక్షపై అస్త్రం
By: Tupaki Desk | 24 Sep 2021 3:32 AM GMTటాలీవుడ్ నుంచి బాలీవుడ్ కి వెళ్లిన తాప్సీ అక్కడ విభిన్నమైన కథా బలమున్న చిత్రాల్లో నటిస్తూ విమర్శకులు ప్రశంసలతో పాటు ప్రేక్షకుల జేజేలు అందుకుంటోంది. ముఖ్యంగా తాప్సీ ఎంచుకుంటున్న కథలు.. చేస్తున్న పాత్రలు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటున్నాయి. తాజాగా తాప్సీ నటిస్తున్న చిత్రం `రష్మీ రాకెట్`. ఆకర్ష్ ఖురానా డైరెక్ట్ చేసిన ఈ మూవీ ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఓ లేడీ అథ్లెట్ తన లక్ష్యం చేరడం కోసం ఎలాంటి అవాంతరాల్ని ఎదుర్కొంది?... ఎలాంటి వివక్షకు గురైంది? తన ద్వారా మహిళ లింగ వివక్ష టెస్టింగ్.. స్త్రీత్వంపై రష్మీ రాకెట్ తన గెలుపు ద్వారా ఈ ప్రపంచానికి ఏ సందేశాన్ని ఇవ్వాలనుకుంది? అనే నేపథ్యంలో సాగే కథ ఇది.
ట్రైలర్‌లో ప్రతీ సీన్ ని అత్యంత గ్రిప్పింగ్ చూపించిన తీరు.. ఓ అథ్లెట్ ఎదుర్కొన్న అవమానాలు.. జెండర్ వివక్షని కళ్లకు కట్టినట్టుగా చూపించే ప్రయత్నం చేశారు. మగరాయుడిలా కనినిస్తోందని రష్మీ రాకెట్‌కి జెండర్ టెస్ట్ నిర్వహిస్తారు... అక్కడ నుంచి రష్మీ రాకెట్ జీవితం సమస్యల సుడిగుండంలోకి నెట్టివేయబడుతుంది. సమాజం.. ప్రపంచం ముందు దోషిగా నిలబడిన రష్మీ హ్యుమన్ రైట్స్ ని ఆశ్రయించి ఎలాంటి పోరాటాన్ని చేసింది.. ఎలా మళ్లీ తన కలని నిజం చేసుకుంది.. ఈ ఫైట్ తో యావత్ మహిళా లోకానికి ఎలాంటి సందేశాన్ని అందించిందన్నది స్ఫూర్తిని నింపేలా వుంది.
ఇక రష్మీ పాత్రలో తాప్సీ పర్ఫెక్ట్ గా కుదిరింది. మెరుపు వేగంతో ట్రాక్ పై దూసుకుపోయే యువతిగా.. అందిలో భిన్నంగా కనిపించే మగరాయుడిలా చాలా శ్రమించి తనని తాను ఈ పాత్ర కోసం సిద్ధం చేసుకున్నట్టుగా కనిపిస్తోంది. గ్రామీణ స్థాయి నుంచి వెళ్లి జాతీయ స్థాయిలో గుర్తింపు కోసం ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న కొంత మంది అథ్లెట్‌ల జీవితాలని స్ఫూర్తిగా తీసుకుని దర్శకుడు ఈ చిత్ర కథని తెరకెక్కించాడు. ఇందులో తాప్సీకి జోడీగా ప్రియాన్షు పన్యులీ నటించగా..అభిషేక్ బెనర్జీ మరో కీలక పాత్రలో కనిపించాడు. తల్లిగా సుప్రియ పాథక్ నటించింది. స్ఫూర్తి వంతమైన స్టోర్ట్స్ డ్రామాగా వస్తున్న ఈ మూవీతో తాప్సీ మరోసారి ప్రశంసలతో పాటు అవార్డులు పొందడం గ్యారెంటీ. ఈ మూవీని అక్టోబర్ 15న జీ5 ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు.