Begin typing your search above and press return to search.
స్టార్ హీరో నిర్వాకాన్ని రివీల్ చేసిన తాప్సీ
By: Tupaki Desk | 4 Nov 2021 4:06 AM GMTక్యాస్టింగ్ కౌచ్ మీద చెలరేగిన దుమారం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఎన్నో షాకింగ్ అంశాలు తెర మీదకు వచ్చాయి. నిజానికి.. ఈ ఎపిసోడ్ తర్వాత నుంచి నటీమణులు కాస్తంత ధైర్యం చేసి మాట్లాడుతున్నారు. తమకు ఎదురయ్యే పరిస్థితుల గురించి వారు ఓపెన్ అవుతున్నారు. తాజాగా విలక్షణ నటి తాప్సీ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. గ్లామర్ షోకు దూరంగా.. కథా బలం ఉన్న సినిమాల్ని చేయటానికి.. కథ.. పాత్ర డిమాండ్ చేయాలే కానీ దేనికైనా సై అన్నట్లుగా వ్యవహరించే తాప్సీని టాలీవుడ్ పట్టించుకోకపోతే.. బాలీవుడ్ మాత్రం అక్కున చేర్చుకుంది.
తాజాగా ఆమె కొత్త విషయాన్ని ప్రస్తావించారు. హీరోయిన్లకు పేరు తీసుకొచ్చే సినిమాల్లో నటించటానికి స్టార్ హీరోలు అస్సలు ఇష్టపడరని చెప్పింది. గతంలో తనకు ఒక సినిమా విషయంలో ఇలాంటి అనుభవం ఎదురైనట్లు ఆమె చెప్పారు. ఆ సినిమాలో తనది డ్యూయల్ రోల్ అని.. ఆ సినిమాకు హీరోగా ఒక స్టార్ హీరోను సంప్రదిస్తే.. అతను నో చెప్పేశారన్నారు. ఆ హీరోతో తాను గతంలో ఒక సినిమాకు పని చేశానని.. అయినప్పటికీ అతను మాత్రం హీరోయిన్ కు ప్రాధాన్యత ఉన్న సినిమాలో తాను నటించలేనని స్పష్టం చేశారు.
హీరోల తీరును బయటపెట్టిన తాప్సీ మాటలు ఇప్పుడు సంచలనంగా మారాయి. హీరోయిన్లకు పెద్ద పీట వేసే సినిమాల్లో నటించేందుకు హీరోలు అస్సలు ఇష్టపడరని.. అలాంటి ఆఫర్లను వారు సున్నితంగా నో చెప్పేసి సైడ్ అవుతారని చెప్పుకొచ్చారు. ఇండస్ట్రీలో హీరోలు అలా ఫీల్ కావటం బాధాకరంగా ఆమె పేర్కొన్నారు.