Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: తాప్సీ థై సొగ‌సు త‌కిదిమితోం

By:  Tupaki Desk   |   21 May 2020 4:30 AM GMT
ఫోటో స్టోరి: తాప్సీ థై సొగ‌సు త‌కిదిమితోం
X
త‌క్కువ స‌మ‌యంలో ఎక్కువ పాపులారిటీ తెచ్చుకున్న నాయిక‌గా తాప్సీ పేరు బాలీవుడ్ లో మార్మోగింది. హిందీ ప‌రిశ్ర‌మ‌లోనే హాటెస్ట్ పెర్ఫామ‌ర్ గా పాపుల‌ర‌య్యింది. పింక్- నామ్ ష‌బానా- మ‌న్మార్జియాన్- బేబి .. ఇలా అన్నీ ప్ర‌యోగాలే. ఒక‌దానితో ఒక‌టి సంబంధం లేని క‌థ‌ల్ని ఎంచుకుని న‌టిగా త‌న‌ని తాను ఎలివేట్ చేసుకుంది. లేడీ ఓరియెంటెడ్ డేరింగ్ కాన్సెప్ట్ లు తాప్సీ ఇమేజ్ ని పెంచాయి.

ఇదే కోవ‌లో తాప్సీ న‌టిస్తున్న తాజా చిత్రం టైటిల్ `హసీన్ దిల్‌రూబా`. ``ఆడ‌ది అబ‌ల కాదు.. ఆది ప‌రాశ‌క్తి! అనే కాన్సెప్టును ఎంచుకునే ఈ సినిమాని తీస్తున్నార‌ని ప్ర‌చార‌మైంది. ఇంత‌కుముందు రిలీజైన ఫ‌స్ట్ లుక్ కి చ‌క్క‌ని స్పంద‌న వ‌చ్చింది. తాప్సీ పన్ను- విక్రాంత్ మాస్సే న‌టీన‌టులుగా తెర‌కెక్కుతున్న చిత్ర‌మిది. వినీల్ మాథ్యూ దర్శకత్వం వహిస్తున్నారు. ఆనంద్ ఎల్ రాయ్ నిర్మిస్తున్నారు. మ‌ర్డ‌ర్ థ్రిల్ల‌ర్ బ్యాక్ డ్రాప్ లో తెర‌కెక్కుతోంది. ఇందులో లేడీ ఓరియెంటెడ్ యాంగిల్ స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. 18 సెప్టెంబర్ 2020న రిలీజ‌వుతుంద‌ని ప్ర‌క‌టించినా ప్ర‌స్తుత లాక్ డౌన్ స‌న్నివేశం వ‌ల్ల ఆల‌స్యం కానుంది.

సోష‌ల్ మీడియాలోనూ తాప్సీ స్పీడ్ గురించి తెలిసిందే. తాజాగా ఇన్ స్టాలో తాప్సీ కొత్త లుక్ రివీలైంది. సింపుల్ వైట్ టాప్.. బ్లూ డెనిమ్.. థై సొగ‌సుని ఎలివేట్ చేస్తున్న ఈ ఫోటో యువ‌త‌రంలో హాట్ టాపిక్ గా మారింది. తాప్సీ నెవ్వ‌ర్ బిఫోర్ అన్న తీరుగా క‌నిపిస్తోంది ఈ ఫోటోలో. అద్దంలో చూస్తూ లిప్ స్టిక్ ని అద్దుతోంది. ఇదో డిజైన‌ర్ కాన్సెప్ట్ అంటూ తాప్సీ చెబుతోంది. ``లాక్ డౌన్ లో ఉన్న‌ప్పుడు.. అది కూడా మీ స్టైలిష్ట్ .. ఫోటోగ్రాఫ‌ర్.. కాన్సెప్ట్ డిజైన‌ర్.. ఫోటో ఎడిట‌ర్.. ఆర్ట్ డైరెక్ట‌ర్.. ఇలా అంద‌రూ ఒక‌టిగా ఉన్న‌ప్పుడు ఇలాంటిది సాధ్యం`` అంటూ తాప్సీ చెప్పుకొచ్చింది. ఇంత‌మంది కృషితో ఇంత అంద‌మైన ఛాయాచిత్రం సాధ్యైమైంద‌ట‌. ప్ర‌ఖ్యాత మ్యాన్స్ వ‌ర‌ల్డ్ ఇండియా క‌వ‌ర్ పేజీ కోసం తాప్సీ ఇలా ఫోజులిచ్చింది. అంతే కాదు తాప్సీ రైటింగ్ హెర్ వోన్ స్క్రిప్ట్! అంటూ క‌థ‌నాన్ని ఈ క‌వ‌ర్ స్టోరీలో ప్ర‌చురిస్తున్నార‌ట‌.