Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: దీన్నేమంటారు తాప్సీ?

By:  Tupaki Desk   |   17 Feb 2017 5:11 AM GMT
ఫోటో స్టోరి: దీన్నేమంటారు తాప్సీ?
X
ప్రస్తుతం తాప్సీ టైం బాగుంది. బాలీవుడ్ లో వెలిగిపోయే అవకాశం వచ్చింది. ఘాజీలో ఈమెది చిన్న పాత్రే అయినా.. లీడ్ హీరోయిన్ అనే రేంజ్ లో బిల్డప్ ఇచ్చేంతటి ఛాన్స్ వచ్చింది. అన్నిటికి మించి అమ్మడి పెర్ఫామెన్స్ కి క్రేజ్ పెరిగింది. వీటన్నిటినీ చూసుకుని.. తాప్సీ ఇప్పుడు తెగ రెచ్చిపోతోంది.

సౌత్ సినిమా రంగంపై.. ముఖ్యంగా టాలీవుడ్ పై తెగ ఆరోపణలు గుప్పించేస్తోంది. తనను గ్లామర్ కోసం వాడుకుని ఐరన్ లెగ్ అన్నారు కానీ.. మంచి అవకాశాలు ఇవ్వలేదన్నది ఈమె ఆరోపణ. మరి బాలీవుడ్ లో ఈ భామ ఏం చేస్తోందా.. ఎలా అవకాశాలు పట్టేస్తాందా అని పరిశీలిస్తే మాత్రం.. అక్కడ కూడా స్కిన్ షోనే ఆధారం. తాజాగా ఎఫ్ హెచ్ ఎం మేగజైన్ కు అమ్మడు ఫోటో షూట్ చేసింది. రకరకాల డ్రెసింగ్స్ తో చేసిన అన్ని ఫోటోల్లోనూ తాప్సీ తన క్లీవేజ్ ను కంప్లీట్ గా ఎక్స్ పోజ్ చేసి పారేసింది.

షోకులు ఆరబోయడంలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ పాటించేస్తున్నట్లుగా ఉంది తాప్సీ. కాని గ్లామర్ కోసం తనను ఉపయోగించుకున్నారని మనోళ్లని ఆడిపోసుకుని.. తీరా అక్కడికి వెళ్లి చేస్తోంది ఏంటో? దీన్ని గ్లామర్ అంటారో ఎక్స్ పోజింగ్ అంటారో.. లేక ఇంకేదైనా కొత్త పేరు పెడుతుందో చూడాలి. షోకుల ప్రదర్శన అంశంపై దక్షిణాది సినీరంగంపై తాప్సీ పన్ను చెప్పినవన్నీ బిల్డప్ కబుర్లే అనే విషయం.. ఈ ఫోటోషూట్స్ తో అర్ధమైపోతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/