Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరిః తాప్సీ అందాల ప్రదర్శన

By:  Tupaki Desk   |   12 Oct 2017 5:01 AM GMT
ఫోటో స్టోరిః తాప్సీ అందాల ప్రదర్శన
X
ఢిల్లీ అందాల సుందరాంగి తాప్సీ పన్ను ఇప్పుడు ఫుల్ ఖుషీ. వరుసగా సినిమాలు హిట్ అయిపోతుంటే ఎవరైనా ఆనందంగానే ఉంటారు కానీ.. అమ్మడు ఇటు టాలీవుడ్ లోను అటు బాలీవుడ్ లోను వరుసగా బ్లాక్ బస్టర్స్ కొట్టేసింది. ఆనందో బ్రహ్మ మూవీతో తెలుగులో అనుకోని విజయాన్ని అందుకున్న ఈ సుందరాంగి.. జుడ్వా2 చిత్రంలో హాట్ హాట్ గా కనిపించేసి ప్రేక్షకులకు కనివిందు చేసింది. గతంలోనే పెర్ఫామెన్స్ చేయగల ఆర్టిస్ట్ గా గుర్తింపు సంపాదించగా.. ఇప్పుడు అందాల ప్రదర్శనలోనూ తన ట్యాలెంట్ చూపించేసింది.

రీసెంట్ గా ఈ 30 ఏళ్ల బ్యూటీ మాగ్జిమ్ ఇండియా మేగజైన్ కోసం ఓ ఫోటో షూట్ చేసింది. గతంలో ఎక్స్ పోజింగ్ కు వ్యతిరేకంగా రకరకాలుగా మాట్లాడి.. దక్షిణాది సినిమాలను తూలనాడిన తాప్సీకి.. జుడ్వా2 మూవీతో బాగానే జ్ఞానోదయం కలిగిందనే విషయం.. రీసెంట్ ఫోటో షూట్ చూస్తే అర్ధమవుతుంది. టూపీస్ బికినీ వేర్ ధరించి.. ఓవర్ కోట్ అలా పైపైన ఉండీ లేనట్లుగా వేసుకుని.. వయ్యారంగా ఇచ్చిన పోజ్ మరీ మరీ బాగుందనే చెప్పాలి. తన అందాలను మాత్రమే ఉపయోగించుకున్నారని తెగ ఫీలయిపోయిన ఈమె.. ఇప్పుడు అదే యాంగిల్ ను బయటకు తీయడం విశేషం.

అయితే.. అటు ట్యాలెంట్ తో పాటు ఇటు ఎక్స్ పోజింగ్ యాంగిల్ కూడా ఉండడం తాప్సీని టెంప్ట్ చేసి ఉండొచ్చు. రెడ్ కలర్ బ్యాక్ డ్రాప్ లో బ్లూ బికినీతో ఉన్న తాప్సీ ఫోటో మాత్రం అభిమానులను తెగ ఖుషీ చేసేస్తోంది.