Begin typing your search above and press return to search.
మెగాస్టార్ పైనే కామెంట్స్ చేసింది
By: Tupaki Desk | 26 Nov 2019 5:48 AM GMTఈమద్య కాలంలో తాప్సి మీడియా లో ఎక్కువగా కనిపిస్తుంది. ఇండస్ట్రీలో పురుషాధిక్యంపై ఎక్కువగా మాట్లాడుతూ వస్తోంది. సౌత్ నుండి బాలీవుడ్ వెళ్లిన తాప్సి అక్కడ ఓపికతో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ స్టార్ హీరోయిన్ గా పేరు దక్కించుకుంది. లేడీ ఓరియంటెడ్ చిత్రాలు చేయడంతో పాటు కమర్షియల్ చిత్రాలు కూడా చేస్తూ వస్తోంది. సినిమాలో ఎంత కీలక పాత్ర చేసినా కూడా ఈమెకు ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదని బాధ పడుతోంది.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో తాప్సి మాట్లాడుతూ.. బద్లా సినిమా కోసం నేను చాలా కష్టపడ్డాను. ఆ సినిమాలో నా పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంది. అందులో మెగాస్టార్ అమితాబ్ జీ కంటే నా సీన్స్ ఎక్కువగా ఉంటాయి. ఆయన కంటే నేను ఎక్కువ రోజులు షూటింగ్ లో పాల్గొన్నాను. అయినా కూడా ఆ సినిమా అమితాబ్ జీ దే అంటూ టాక్ వచ్చింది. ఆ విషయం నాకు చాలా నిరుత్సాహంను కలిగించింది. నేను పడ్డ కష్టం కు ఆ సినిమా కు నాకు పేరు రావాలి. కాని అది బిగ్ బి సినిమా అంటూ వార్తలు రావడం నాకు చాలా బాధను కలిగించాయి.
ఆ విషయాన్ని నేను గతంలోనే అన్నాను. అప్పుడు నాకు కాస్త గుర్తింపు దక్కేలా చేశారు. ఇంకా కొన్ని సినిమాల విషయం లో కూడా ఇలాగే జరిగింది అంటూ తాప్సి ఆవేదన వ్యక్తం చేసింది. పడ్డ కష్టంకు హీరోల స్థాయిలో పారితోషికాలు ఎలాగూ ఇవ్వడం లేదు. కనీసం గుర్తింపు అయినా దక్కాలని ఆశిస్తున్నాం అంటూ తాప్సి చెప్పుకొచ్చింది. ప్రతిభ చూపిస్తున్నా కూడా హీరోయిన్స్ కు అంతగా గుర్తింపు ఇవ్వడం లేదంటూ తాప్సి చేసిన వ్యాఖ్యలను బాలీవుడ్ లోని పలువురు హీరోయిన్స్ సమర్ధిస్తున్నారు. సోషల్ మీడియా లో కూడా ఆమె కు మద్దతు తెలుపుతున్నారు.