Begin typing your search above and press return to search.

తాప్సి అక్క‌డ కొట్టింది!

By:  Tupaki Desk   |   25 Dec 2015 7:30 AM GMT
తాప్సి అక్క‌డ కొట్టింది!
X
హిందీపై గంపెడాశ‌ల‌తో ముంబైకి మ‌కాం మార్చింది తాప్సి. ఆరంభంలో ఒక‌ట్రెండు మంచి అవ‌కాశాలే వ‌చ్చాయి. బేబిలాంటి సినిమాతో ఇటీవ‌ల హిట్టు కూడా కొట్టింది. కానీ ఎందుకో తాప్సికి ఆఫ‌ర్లు రావ‌డం లేద‌క్క‌డ‌. అంత‌కుమించిన అంద‌గ‌త్తెలు రోజుకొక‌రు తెర‌పైకి వ‌స్తుండ‌డ‌మే అందుకు కార‌ణం కావొచ్చు. అందుకే తాప్సి మ‌ళ్లీ సౌత్‌ లోనే బిజీ అవ్వాల‌ని నిర్ణ‌యించుకుంది.త‌న‌కి తెలిసిన ద‌ర్శ‌క‌నిర్మాత‌లంద‌రినీ లైన్లో పెట్టే ప్ర‌య‌త్నం చేస్తోంది. దీంతో ఇటీవ‌ల ఆమెని కొన్ని ఆఫ‌ర్లు వ‌రించిన‌ట్టే అనిపించాయి. అందులో నిఖిల్ సినిమా ఒక‌టి. మురుగ‌దాస్ శిష్యుడైన ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో నిఖిల్ ఓ సోషియో ఫాంట‌సీ సినిమా చేయాల‌ని నిర్ణ‌యించుకొన్నాడు. ఆ సినిమాలో తాప్సి ఓ క‌థానాయిక అని ప్ర‌చారం సాగింది. మ‌రి ఏమైందో ఏంటో తెలియ‌దు కానీ... అనూహ్యంగా ఆ ఆఫ‌ర్ తాప్సి చేజారియ‌పోయింది. దీంతో కాస్త డీలాప‌డ్డ‌ట్టు క‌నిపించిన తాప్సికి అంత‌కుమించిన ఓ క్రేజీ ఆఫ‌ర్ హిందీ నుంచి ల‌భించిన‌ట్టు స‌మాచారం. అది కూడా బిగ్ బీ అమితాబ్‌ బచ్చన్‌ చిత్రంలో. నిజంగా ఇది క్రేజీ ఆఫ‌రే క‌దా!

సూజిత్‌ సర్కార్ ద‌ర్శ‌క‌త్వంలో అమితాబ్ ఓ చిత్రం చేయ‌బోతున్నారు. అందులో క‌థానాయికగానో లేక ఇత‌ర పాత్రో తెలియ‌దు కానీ.. తాప్సిని మాత్రం ఎంపిక చేసేశార‌ట‌. బేబి సినిమాలో తాప్సి న‌ట‌న‌ని చూసే సూజిత్ స‌ర్కార్ తాప్సికి క‌బురు పెట్టాడ‌ట‌. చాలా రోజుల త‌ర్వాత హిందీ నుంచి వ‌చ్చిన ఈ మంచి అవ‌కాశాన్ని ఎలాగైనా క్యాష్ చేసుకోవాల‌ని తాప్సి ప్ర‌యత్నిస్తున్న‌ట్టు తెలుస్తోంది. హిందీ నుంచి అవ‌కాశ‌మొచ్చినా స‌రే ద‌క్షిణాదిలో ఆఫ‌ర్ల కోసం ప్ర‌య‌త్నాలు చేస్తూనే ఉండాల‌ని తాప్సి నిర్ణ‌యించుకొన్న‌ట్టు స‌మాచారం.