Begin typing your search above and press return to search.
ఒక్క సినిమా కోసం నలుగురి దగ్గర ట్రైనింగ్ తీసుకుంటున్న హీరోయిన్...!
By: Tupaki Desk | 22 April 2020 11:30 PM GMTప్రస్తుతం టాలీవుడ్ బాలీవుడ్ లలో బయోపిక్స్ హవా నడుస్తోంది. ఇప్పటికే మన ఇండస్ట్రీలలో చాలా బయోపిక్స్ ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి విజయాన్ని అందుకున్నాయి. ఈ నేపథ్యంలో లాస్ట్ ఇయర్ 'సాండ్ కీ ఆంఖ్' బయోపిక్ చిత్రంలో నటించిన తాప్సీ మరో బయోపిక్ లోనూ నటిస్తోంది. గుజరాత్ అథ్లెట్ రష్మీ జీవితం ఆధారంగా దర్శకుడు ఆకర్ష్ ఖురాన్ తెరకెక్కిస్తున్న చిత్రం 'రష్మీ రాకెట్'. ఈ చిత్రంలో తాప్సీ టైటిల్ రోల్ పోషిస్తున్నారు. ఇందులో తాప్సీ భర్తగా ఆర్మీ ఆఫీసర్‌గా ప్రియాన్షు పైన్యూలి నటించబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్‌ను విడుదల చేయగా మంచి స్పందన వచ్చింది. రష్మీ తన పరుగుతో ఎన్నో విజయాలను.. ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇందుకుగానూ గుజరాత్ ప్రజలు రష్మీని 'రాకెట్' అని పిలుస్తుంటారు. దీన్ని ఆధారంగా చేసుకుని దర్శకుడు 'రష్మీ రాకెట్' పేరుతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా కరోనా కారణంగా షూటింగ్ నిలుపుదల చేసుకుంది. అయితే ఈ సినిమా కోసం తాప్సి బాగానే కష్టపడుతోందట. రష్మీ పాత్ర కోసం తాప్సీ ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నారు. అదీ ఒక్కరితో కాదు.. ఏకకాలంలో నలుగురి దగ్గర ట్రైనింగ్ తీసుకుంటోంది. ఒక ట్రైనర్ వేగంగా ఎలా పెరిగెట్టాలో చెబుతూ 'స్ప్రింట్'లో మెళకువలు ఇస్తున్నారు.. ట్రాక్ అథ్లెట్స్ కి ఇచ్చే ట్రైనింగ్ అన్నమాట. మరొక ట్రైనర్ ప్రొఫెషనల్ స్ప్రింటర్స్ కి అవసరమైన శారీరక ధారుడ్యం కోసం ఆమెకు శిక్షణ ఇస్తున్నారు.. అంటే మజిల్స్ పెంచే పనిలో తాప్సీ పడ్డారు. ఇంకొకరు న్యూట్రీషనిస్ట్.. ఎటువంటి ఆహారం తీసుకోవాలో చెబుతారు. మరొకరు ఫిజియోథెరపిస్ట్.. ట్రైనింగ్ లో గాయాలు కాకుండా చూసుకుంటారు. నెల రోజుల్లో ప్రొఫెషనల్ అథ్లెట్ ఫిజిక్ లోకి వస్తానని తాప్సీ అంటున్నది. మరి ఇంత కష్టపడుతున్న తాప్సీకి ఈ 'రష్మీ రాకెట్' సినిమా ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.