Begin typing your search above and press return to search.

తాప్సితో ప్రకాష్ రాజ్ పెద్ద సాహసమే చేయించాడు

By:  Tupaki Desk   |   26 Jun 2016 5:41 AM GMT
తాప్సితో ప్రకాష్ రాజ్ పెద్ద సాహసమే చేయించాడు
X
ఇప్పటి హీరోయిన్ల రూటే వేరు. ఏదో వచ్చామా.. మొక్కుబడిగా సినిమా చేసి వెళ్లిపోయామా అన్నట్లు ఉండట్లేదు ఇప్పటి కథానాయికలు. ఏ భాషలో నటిస్తే ఆ భాష నేర్చుకుంటున్నారు. సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంటున్నారు. పాటలు పాడుతున్నారు. ఇంకా తమ టాలెంట్ ఏదైనా ఉంటే చూపిస్తున్నారు. సొట్టబుగ్గల సుందరి తాప్సి అయితే మిగతా హీరోయిన్ల కంటే ఓ అడుగు ముందుకేసి తన పాత్రకు తనే సొంతంగా డైలాగులు కూడా రాసేసుకుంటోంది. తాను హిందీలో నటిస్తున్న కొత్త సినిమా ‘తడ్కా’ కోసం ఈ సాహసం చేస్తోందామె. ఆమెతో ఈ సాహసం చేయిస్తున్న దర్శకుడు ప్రకాష్ రాజ్ కావడం విశేషం.

తెలుగు-తమిళం- కన్నడ భాషల్లో ప్రకాశ్‌రాజ్ నటించి.. దర్శకత్వం వహిస్తూ నిర్మించిన సినమా ‘ఉలవచారు బిర్యాని’. దీన్నే హిందీలో హిందీలో ‘తడ్కా’ పేరుతో రీమేక్ చేస్తున్నాడు ప్రకాష్. అక్కడ నానా పటేకర్ ప్రకాష్ రాజ్ పాత్ర పోషిస్తుంటే.. ఆయనకు జంటగా శ్రియ నటిస్తోంది. సినిమాలోని మరో యువ జంటగా అలీ ఫాజల్-తాప్సి నటిస్తున్నారు. ఐతే ఈ సినిమా విషయంలో నటీనటులకు ప్రకాష్ రాజ్ ఓ వెరైటీ సూచన చేశాడట. మీ పాత్రలకు మీరే డైలాగ్స్ రాసుకోండి అన్నాడట.

తాప్సి ఏమాత్రం భయపడకుండా.. కాన్ఫిడెంటుగా తన పాత్రకు తనే మాటలు రాసేసుకుందట. ఈ సంగతి ఆమే స్వయంగా వెల్లడించింది. ‘‘ఏ ఆర్టిస్టు అయినా పాత్రను పూర్తిగా అర్థం చేసుకుంటే ఆ పాత్ర ఏం మాట్లాడితే బాగుంటుందో వాళ్లకు తెలుస్తుందని ప్రకాష్ రాజ్ సార్ అన్నారు. ఆర్టిస్టులే స్వయంగా డైలాగులు రాసుకుంటే ఆ పాత్ర.. సన్నివేశాలు బాగా పండుతాయని చెప్పారు. అందుకే మా డైలాగులు మేమే రాసుకున్నాం’’ అని చెప్పింది తాప్సి. మరి రచయిత్రిగా తాప్సి టాలెంటేంటో ఈ సినిమా విడుదలయ్యాక తెలుసుకుందాం.