Begin typing your search above and press return to search.

చైతూ సెక్రటరీ.. మళ్ళీ బూతు సినిమాయే

By:  Tupaki Desk   |   4 March 2016 11:00 AM IST
చైతూ సెక్రటరీ.. మళ్ళీ బూతు సినిమాయే
X
100% లవ్‌ సినిమాలో నాగ చైతన్య సెక్రటరీ యాక్ట్‌ చేసి.. చివరకు అతగాడిని పెళ్లాడటానికి సిద్దపడిన ఆ బుల్లెమ్మ గుర్తుందా? ఆ మధ్యన తెలుగులో మనీ మనీ మోర్‌ మనీ సినిమాలో హీరోయిన్‌ గా కూడా నటించింది ఈ పిల్ల. అమ్మడి పేరు తారా అలీషా బెర్రి. ఈ తార బాలీవుడ్‌ లో దున్నేయాలని ఆ మధ్యన 'మస్ర్తం' అనే ఓ ఎరోటిక్‌ సినిమాలో నటించింది. ఒక సెక్స్‌ కథల రచయిత జీవితగాధే ఆ సినిమా. ఇప్పుడు మళ్లీ మరో ఎరోటిక్‌ థీమ్‌ ఉన్న సినిమాతో అమ్మడు విచ్చేస్తోంది.

రాజ్‌ - 1920 వంటి సినిమాలను తీసని విక్రమ్‌ బట్‌ డైరక్షన్‌ లో ''లవ్‌ గేమ్స్‌'' అనే సినిమా వస్తోంది. ఈ సినిమాలో పత్రలేఖ గా పేరు మార్చుకొని 'సిటీ లైట్స్‌' సినిమాతో అందరినీ ఆకట్టుకున్న అన్విత పౌల్‌ లీడ్‌ రోల్‌ చేస్తోంది. గౌరవ్‌ అరోరా ఈమె ప్రియుడుగా నటిస్తున్నాడు. అప్పటికే పెళ్ళయిన ఈ ఇద్దరూ వేరే వేరే జంటలకు విడివిడిగా లైన్‌ వేసి.. ''భార్యతో నువ్వు సుఖపడు.. భర్త సంగతి నేను చూసుకుంటా'' అనే బాపత్తులో ఎంజాయ్‌ చేస్తుంటారు. సడన్‌ గా ఈ జర్నీలో తారా అలీషా ని ఇతగాడు పడేస్తాడు. ఆమె భర్తను పత్రలేఖ లైన్లో పెడుతుంది. కాని ట్విస్టేంటంటే.. ఈసారి గౌరవ్‌ మన తారతో ప్రేమలో పడిపోతాడు. అబ్బో లిప్‌ లాకులూ.. సెమీ న్యూడ్ సీన్లూ.. తారా బాగానే ఆరేసింది.

కాకపోతే ఎంత చెప్పుకున్నా కూడా.. ఇదో బూతు సినిమాగానే మిగిలిపోయే ఛాన్సుంది. అటు పత్రలేఖ.. ఇటు తారా అలీషా.. చూస్తూ చూస్తూ ఇలా దాదాపు బ్లూ ఫిలిం కాన్సెప్టు ఉన్న ఈ సినిమాలో ఎందుకు నటించారో మరి. ఇవే బాగా పేరు తెస్తాయ్‌ అనుకున్నారేమో.