Begin typing your search above and press return to search.
రాజశేఖర్ తో సెల్ఫీ.. నోరువిప్పిన తారా చౌదరి
By: Tupaki Desk | 10 Aug 2018 10:10 AM GMTఒక్క ఫొటో.. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వివిధ మీడియా సంస్థల్లో గాసిప్పులకు కారణమైంది. హీరో రాజశేఖర్ తో నటి తారా చౌదరి దిగిన ఫొటోపై రకరకాల ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. వీరిద్దరి మధ్య ఏదో ఎఫైర్ ఉందని ఇష్టమొచ్చినట్టు రాసేశారు. ఈ విషయంలో ఓసారి రాజశేఖర్ స్వయంగా వివరణ ఇచ్చినా చల్లారలేదు. తాజాగా ఓ యూట్యూబ్ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తారా చౌదరి స్పందించింది. హీరో రాజశేఖర్ తో తనకున్న బంధాన్ని వివరించింది.
తారా చౌదరి మాట్లాడుతూ ‘సినిమా ఇండస్ట్రీలోకి రాకముందు రాజశేఖర్ నటించిన ‘మా అన్నయ్య’ సినిమా చూశా.. ఆ సినిమాతో ఆయన ఫ్యాన్ గా మారిపోయాను. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఒక షూటింగ్ లో రాజశేఖర్ గారిని మీట్ అయ్యాను. ఆయన అభిమానినని పరిచయం చేసుకున్నాను. ఆ తర్వాత తాను ఉంటున్న శ్రీనగర్ కాలనీలోని ఫ్లాట్ పక్కన ఇంటిలోకి చేరేందుకు రాజశేఖర్-జీవిత వచ్చి చూశారు. స్థలం సరిపోదని వెళ్లిపోయారు. ఆ సమయంలోనే రాజశేఖర్ గారితో తాను సెల్ఫీ దిగాను. ఆ ఫొటో చూసి నన్ను రకరకాలుగా బ్లేమ్ చేశారు. వాళ్లను కూడా బెదిరించినట్టు తెలిసింది ’ అని తారా వాపోయింది.
'రాజశేఖర్ కు - నాకు సంబంధం పెడుతూ వస్తున్న వార్తలు అవాస్తవం. దయచేసి ఇలాంటి వార్తలు మళ్లీ రానియ్యకండి.. ఆయన చాలా మంచోడు.. ' అంటూ చివరగా తారా వివరణ ఇచ్చింది.