Begin typing your search above and press return to search.

చరణ్ రామరాజు తారక్ కొమరం భీమ్ : ఆర్ ఆర్ ఆర్

By:  Tupaki Desk   |   14 March 2019 7:32 AM
చరణ్ రామరాజు తారక్ కొమరం భీమ్ : ఆర్ ఆర్ ఆర్
X
ఆర్ ఆర్ ఆర్ నేపధ్యం గురించి అందులో ఇద్దరు హీరోల పాత్రల తీరుతెన్నుల గురించి ఈ రోజు జరిగిన ప్రెస్ మీట్ లో రాజమౌళి పూర్తి వివరణ ఇచ్చేశాడు. 1897 ప్రాంతంలో బ్రిటిష్ పాలనకు ఎదురు తిరిగి వాళ్ళ కంటికి కునుకు లేకుండా చేసి భరతమాత కోసం ప్రాణాలు అర్పించిన అల్లూరి సీతారామరాజు తరహా పాత్రలో రామ్ చరణ్ కనిపిస్తాడు. 1901 పీరియడ్ లో నిజాం పాలనకు ఎదురు తిరిగి బానిసత్వ సంకెళ్ళను ప్రశ్నించిన కొమరం భీమ్ ని పోలిన పాత్రని జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్నాడు.

ఈ ఇద్దరు వేర్వేరు ప్రాంతాలకు వేర్వేరు నేపధ్యాలకు చెందిన వాళ్ళు. ఇద్దరి లక్ష్యం ఒకటే. ఇద్దరి ఆశయం ఒకటే. యుక్త వయసులో అజ్ఞాతంలోకి వెళ్లి వచ్చి తమను తాము ప్రపంచానికి విప్లవ వీరులుగా పరిచయమయ్యారు. విడిగానే ఇంత ప్రభావం చూపి చరిత్ర రాసిన ఈ ఇద్దరు మహావీరులు ఒకే సమయంలో ఒకరికొకరు స్నేహితులుగా తారసపడి స్ఫూర్తినిచ్చుకుంటే అదే ఆర్ఆర్ఆర్

తన రెగ్యులర్ స్టైల్ లో రాజమౌళి కథకు సంబంధించిన కీలకమైన పాయింట్ ను ఓపెన్ చేసేశాడు. అలా అని ఇది రామరాజు కొమరం భీమ ల జీవిత కథ కాదని కేవలం వాళ్ళను స్ఫూర్తిగా తీసుకుని ఫాంటసీని మిక్స్ చేసిందే తప్ప దీనికి ఎటువంటి ఆధారాలు లేవని స్పష్టత ఇచ్చేశాడు.

మాములు వ్యక్తులనే సూపర్ హీరోలుగా చూపించే తాను మన దేశానికి సేవ చేసిన నిజమైన దేశ భక్తులను ఏ స్థాయిలో చూపిస్తానో మీరే ఊహించుకోండి అంటూ ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు రాజమౌళి సమాధానం చెప్పడం అంచనాలు పెంచేసింది. ఇందులో వర్తమనం ఉండదని ఇద్దరు వీరులు 1920 ప్రాంతంలో ఉత్తర ప్రాంతంలో చేసిన పోరాటమే అని జక్కన్న చెప్పేశాడు కాబట్టి ఆల్మోస్ట్ అన్ని డౌట్స్ కి చెక్ పడినట్టే