Begin typing your search above and press return to search.

ఆస్కార్ రేసులో నెంబర్ 1గా ఉన్న తారక్

By:  Tupaki Desk   |   20 Jan 2023 7:26 AM GMT
ఆస్కార్ రేసులో నెంబర్ 1గా ఉన్న తారక్
X
ఇండియా నుంచి మొదటి సారిగా ఆస్కార్ రేసులో చివరి ఫైనల్ స్టేజ్ వరకు ఆర్ఆర్ఆర్ సినిమా ఈ సారి కచ్చితంగా వెళ్ళేలా కనిపిస్తుంది. ఇప్పటికే నాటు నాటు సాంగ్ కి బెస్ట్ ఒరిజినల్ స్కోర్ కేటగిరీలో గోల్డెన్ గ్లోబ్ అవార్డుని ఎంఎం కీరవాణి అందుకున్నారు. ఇక ప్రతిస్తాత్మకమైన గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడంతో ఆస్కార్ కి అడుగుదూరంలో ఆర్ఆర్ఆర్ మూవీ ఉందనే మాట వినిపిస్తుంది. ఇదిలా ఉంటే ఆస్కార్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మొదటి సారిగా అత్యధిక ఓటింగ్ జరిగిందని కూడా బయటకి వచ్చింది.

ఇదంతా ఆర్ఆర్ఆర్ సినిమా మీద ఉన్న క్రేజ్ నేపధ్యంలో ఈ సారి వోటింగ్ కూడా పెరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. పలు విభాగాలలో ఆస్కార్ బరిలో ఆర్ఆర్ఆర్ సినిమా పోటీ పడుతుంది. టాప్ లిస్టులోకి కూడా ఈ మూవీ ఇప్పటికే చేరుకుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా నుంచి ఆస్కార్ బరిలో బెస్ట్ యాక్టర్ కేటగిరీలో నలుగురు నటులనిని యూఎస్ఎ టుడే లైఫ్ అనే వెబ్ సైట్ ప్రముఖంగా ప్రస్తావించింది.

ఈ సారి ఆస్కార్ నామినేషన్ లో బ్రిలియంట్ పెర్ఫార్మెన్స్ తో టాప్ లో పోటీ పడే వారిలో టాప్ క్రూజ్ తో పాటు పలువురు హాలీవుడ్ నటులు ఉన్నారు. అయితే వీరితో పోటీ పడుతూ నెంబర్ వన్ పొజిషన్ ఎక్కువ మంది ఓటింగ్స్ తో తారక్ నిలబడం విశేషం. ఈ నేపధ్యంలో తారక్ కి బెస్ట్ యాక్టర్ కేటగిరీలో ఆస్కార్ వచ్చే అవకాశం ఉందని ఆ వెబ్ సైట్ అంచనా వేస్తుంది.

యానిమల్ ఫైట్ ఎపిసోడ్ తో పాటు మోటర్ బైక్ షాట్స్ తారక్ పెర్ఫార్మెన్స్ లెవల్ లో మరో ఎండ్ కి తీసుకెళ్లాయని ఈ నేపధ్యంలో అతని ఆస్కార్ స్క్రీనింగ్ లో బెస్ట్ యాక్టర్స్ కేటగిరీలో అవార్డు అందుకోవడానికి అన్ని అర్హతలు ఉన్న వ్యక్తిగా టాప్ 1 లో ఉన్నాడని ఆ వెబ్ సైట్ ట్విట్టర్ లో పేర్కొంది. నిజంగా తారక్ కి ఆస్కార్ వస్తే మాత్రం అది ఇండియన్ సినిమా చరిత్రలో కచ్చితంగా అద్బుతం అవుతుందని చెప్పాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.