Begin typing your search above and press return to search.

తార‌క్ .. ఈ లుక్ త్రివిక్ర‌మ్ మూవీ కోస‌మేనా?

By:  Tupaki Desk   |   18 Oct 2020 1:00 PM GMT
తార‌క్ .. ఈ లుక్ త్రివిక్ర‌మ్ మూవీ కోస‌మేనా?
X
అవ‌స‌రాన్ని బ‌ట్టి ఫిట్నెస్ త‌ర‌గ‌తులు. నా అభిప్రాయం ప్రకారం ఫిట్‌నెస్ నిర్వచనం వైరుధ్యమైన‌ది. ఇది మీ లక్ష్యంపై ఆధారపడి ఉంటుంది ... ఉదాహరణకు మారథాన్ రన్నర్ కావ‌డానికి బాడీబిల్డింగ్ అవ‌స‌రం లేదు. ఆ త‌ర‌హా ఫిట్ నెస్ స్థాయితో క్రీడాకారుల్ని స‌రిపోల్చడం అమాయకత్వం అనిపిస్తుంది. ఎందుకంటే వారు తమ క్రీడల్లో మాత్ర‌మే శిక్షణ పొందుతారు. ఒక బాడీ బిల్డర్ దాని కోసం శిక్షణ లేకుండా మారథాన్ ను ప్రయత్నించినట్లయితే ‌ మొదటి రెండు మైళ్ళలోనే అయిపోతారు. అయితే మీరు ఆ మారథాన్ రన్నర్ ను తీసుకొని అతన్ని లేదా ఆమె తీవ్రమైన బాడీబిల్డింగ్ సెషన్ చేయిస్తే మరుసటి రోజు ఎటూ క‌ద‌ల్లేరు..
-
నాకు వ్యక్తిగతంగా ఫిట్‌నెస్ అనేది ఒక జీవన విధానం. నేను శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండటానికి ఒక నిర్దిష్ట మార్గాన్ని ఎంచుకున్నాను. తిన‌డంలో వ్యాయామం చేయ‌డంలో.. అంటూ తార‌క్ విదేశీ ఫిట్నెస్ ట్రైనర్ లాయ్డ్ ఇదివ‌ర‌కూ సెష‌న్ లో వెల్ల‌డించారు. అయితే బాగా ఫ్యాటీగా మారిపోయిన తార‌క్ లుక్ ని మార్పించేందుకు టెంప‌ర్ స‌మ‌యంలో పూరి జ‌గ‌న్నాథ్ చాలానే ప్ర‌య‌త్నించారు. అప్ప‌టి నుంచే అత‌డిలో మార్పు క‌నిపించింది.

ఒక‌సారి 6 ప్యాక్ లుక్ లోకి మారిపోయాక ఇక తార‌క్ వెనుదిరిగి చూసిందే లేదు. లాయ్డ్ అందుబాటులో లేక‌పోయినా స్థానిక ఫిట్నెస్ ట్రైన‌ర్ల స‌మ‌క్షంలో త‌న‌ని తాను తీర్చిదిద్దుకుంటున్న తీరు ఆస‌క్తిక‌రం. ఇదిగో త‌న జిమ్ కోచ్ తో క‌లిసి ఇలా ఫోజిచ్చాడు తార‌క్. హైద‌రాబాద్ జిమ్ లో రెగ్యుల‌ర్ గా క‌స‌ర‌త్తులు చేస్తూ షేప‌వుట్ అవ్వ‌కుండా జాగ్ర‌త్త ప‌డుతున్నాడు. బైసెప్.. ట్రై సెప్.. బాడీ షేప్ విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌లే తీసుకుంటున్నాడ‌ని ఈ లుక్ చూడ‌గానే అర్థ‌మ‌వుతోంది. త‌దుప‌రి త్రివిక్ర‌మ్ .. కేజీఎఫ్ ప్ర‌శాంత్ నీల్ లాంటి స్టార్ డైరెక్ట‌ర్ల‌తో తార‌క్ ప‌ని చేయాల్సి ఉంది. క‌థ కంటెంట్ కి త‌గ్గ‌ట్టు త‌న‌ని తాను మ‌లుచుకుంటున్నాడ‌న్న‌మాట 35 ప్ల‌స్ ఏజ్ లో..