Begin typing your search above and press return to search.
వావ్!! మోహన్ లాల్ కోసం నందమూరి గెస్ట్
By: Tupaki Desk | 23 July 2016 3:25 PM GMTఇప్పుడు ''మనమంతా'' ట్రయిలర్ చూసి ఆల్రెడీ చాలామంది ఎగ్జయిట్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ట్రైలర్ కేవలం ఓ నలుగురి కథ చెబుతున్నారనకుంటూ.. అందరూ మోహన్ లాల్ - గౌతమి మరియు మరో స్కూల్ పాప - ఇంకో కుర్రాడిని మాత్రమే చూస్తున్నారు. కాకపోతే ఇక్కడే ఒక ట్విస్టు ఉంది.
ట్రైలర్ మరోసారి క్షుణ్ణంగా చూడండి.. మీకు కనిపించే మరో ఎలిమెంట్ కూడా ఉంది. అక్కడ గెస్టు ఎప్పీయరెన్సు అన్నట్లు ట్రైలర్లో ఒకతను కనిపిస్తున్నాడు కదూ. అవును - అతగాడు అప్పట్లో ఒకేసారి 9 సినిమాలతో హీరోగా తెరంగేట్రం చేసిన నందమూరి తారకరత్న. మనోడు ఆ మధ్యన 'రాజా చెయ్యి వేస్తే' సినిమాలో స్టయిలిష్ విలన్ గా మారాడు కాని.. అది వర్కవుట్ కాలేదు. కాకపోతే తన లుక్కుతో కిక్కిచ్చాడు. అదే ఊపులో ఇప్పుడు దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి మనమంత సినిమాలో ఒక కీలకపాత్ర ఇచ్చాడట. అది విలనీయా లేకపోతే ఇంకేదైనానా అనే విషయం తెలియదు కాని.. తారకరత్న మాత్రం కథలో చాలా బలమైన కీలకమైన పాత్రను పోషిస్టున్నట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా పాప క్యారెక్టర్ తో లింకై ఉండే రోల్ చేస్తున్నాడట. అక్కడి నుండి ఈ నలుగురి జీవితాలూ ఎలా లింక్ అవుతాయి అనే విషయంలో కూడా నందమూరి హీరోదే మెయిన్ రోల్ అంటున్నారు సన్నిహితులు. ప్రస్తుతానికైతే వావ్ అనాల్సిందే. వెండితెర మీద పెర్ఫామెన్స్ చూశాక మిగిలింది మాట్లాడుకుందాం.