Begin typing your search above and press return to search.
తారకరత్న మళ్లీ వచ్చాడు
By: Tupaki Desk | 23 Jun 2015 1:30 PM GMTహీరోగా అరంగేట్రంలోనే ఒకేసారి తొమ్మిది సినిమాలకు ముహూర్తం.. బహుశా ప్రపంచ సినీ చరిత్రలోనే ఏ హీరోకు కూడా ఇలాంటి రికార్డు ఉండి ఉండదేమో! అలాంటి ఘనత దక్కిన ఏకైక కథానాయకుడు తారకరత్న. స్టార్ హీరోగా ఎదిగిన జూనియర్ ఎన్టీఆర్‌కు కూడా మొదట్లో ఇంత హంగామా లేదు. కానీ అంత చేసి ఏం లాభం? అప్పుడు ముహూర్తం జరుపుకున్న సినిమాల్లో సగం కూడా పట్టాలపైకి ఎక్కలేదు. ఇప్పటిదాకా రెండంకెల సంఖ్యలో సినిమాలు చేశాడు కానీ.. అందులో ఒక్కటీ ఏవరేజ్ అని కూడా అనిపించుకోలేదు. అయినా తారకరత్న దండయాత్ర మాత్రం ఆగట్లేదు.
ఈ మధ్యే 'కాకతీయుడు' అనే సినిమా చేశాడు తారక్. గతంలో సింహరాశి, శివరామరాజు లాంటి హిట్ సినిమాలు తీసి, ఆపై ఫ్లాప్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయిన సముద్ర తన పేరును విజయసముద్రగా మార్చుకుని మరీ ఈ సినిమా తీశాడు. ఆ మధ్య రిలీజ్ చేసిన ట్రైలర్ చూసి జనాలకు దిమ్మదిరిగిపోయింది. ఆ షాక్ నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటుండగా.. ఇప్పుడు ఆడియో ఫంక్షన్‌తో మళ్లీ వార్తల్లోకి వచ్చింది 'కాకతీయుడు' టీమ్. రాజశేఖర్, బి.గోపాల్ లాంటి ప్రముఖులు వచ్చి ఆడియో రిలీజ్ చేశారు. తన కెరీర్లో మరిచిపోలేని సినిమా 'కాకతీయుడు' అని.. తాను ద్విపాత్రాభినయం చేస్తున్నానని.. ఓ క్యారెక్టర్ కోసం సిక్స్ ప్యాక్ కూడా చేశానని చెప్పుకొచ్చాడు తారకరత్న. ఇది మంచి కమర్షియల్ సినిమా అని.. తెలుగు ప్రేక్షకులు ఆదరించాలని కోరాడు. ఈ సినిమాతోనైనా తారకరత్న సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడేమో చూద్దాం.