Begin typing your search above and press return to search.

రజినీకాంత్ లుక్ లో ఎన్టీఆర్… అదిరింది?

By:  Tupaki Desk   |   19 Jan 2023 6:32 AM GMT
రజినీకాంత్ లుక్ లో ఎన్టీఆర్… అదిరింది?
X
నందమూరి కుటుంబం నుంచి బాలకృష్ణ, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ తర్వాత సినిమా ఇండస్ట్రీలో నటుడిగా రాణిస్తున్న వ్యక్తి తారకరత్న అని చెప్పాలి. కెరియర్ ఆరంభంలో తెరంగేట్రంతోనే ఏకంగా 10 సినిమాలని ఎనౌన్స్ చేసిన తారకరత్న అనుకున్న స్థాయిలో హీరోగా మాత్రం సక్సెస్ కాలేదని చెప్పాలి. ఆరంభంలో అతని లుక్ కూడా హీరోగా అతని ఫెయిల్యూర్ కి ఒక కారణం అయ్యింది.

అయితే హీరోగా ఫెయిల్ అయిన తారక్ విలన్ గా టర్న్ తీసుకొని తనదైన పెర్ఫార్మెన్స్ తో మెప్పిస్తూ మంచి అవకాశాలని సొంతం చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. విలన్ గా సక్సెస్ కావడంతో మరల ఇప్పుడు హీరోగా తిరిగి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఓ వైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా నటిస్తూనే మరో వైపు హీరోగా కూడా ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడనే మాట టాలీవుడ్ లో వినిపిస్తుంది.

అలాగే ఇప్పటికే రాజకీయాలలోకి కూడా ఎంట్రీ ఇచ్చి వచ్చే ఎన్నికలలో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావిస్తున్నాడు. ఇదిలా ఉంటే తారకరత్న గత కొంతకాలంగా గెడ్డం లుక్ లో దర్శనం ఇస్తున్నాడు. భాగా గెడ్డం పెంచాడు. అది కూడా కంప్లీట్ గా సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో ఉండటం విశేషం. తాజాగా ఇదే లుక్ తో ఫోటోషూట్ చేసుకొని ట్విట్టర్ లో షేర్ చేశారు.

ఆ లుక్ కాస్తా ఇప్పుడు వైరల్ అవుతుంది. ఈ గెడ్డం లుక్ లో తారకరత్న అచ్చం కబాలి సినిమాలో రజినీకాంత్ లా ఉన్నాడని నెటిజన్లు కామెంట్స్ చేస్తూ ఉండటం. అయితే ఈ వెరైటీ లుక్ ని తారక్ తన కొత్త సినిమా కోసం ట్రై చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే హీరో పాత్ర కోసమా, లేదంటే విలన్ పాత్ర కోసం ఈ లుక్ లోకి మారాడా అనేది తెలియాల్సి ఉంది. ఇప్పటికే 9 అవర్స్ అనే వెబ్ సిరీస్ తో తారకరత్న డిజిటల్ ఎంట్రీ కూడా ఇచ్చాడు.

ఈ వెబ్ సిరీస్ కి మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. ఈ నేపధ్యంలో వెబ్ సిరీస్ కోసం ఏమైనా ట్రై చేస్తున్నాడేమో అనే క్వశ్చన్ కూడా వస్తుంది. అయితే ప్రస్తుతం సౌత్ ఇండియాలో ఈ రెట్రో స్టైల్ గెడ్డం లుక్ అనేది కేజీఎఫ్ సిరీస్ తో భాగా పాపులర్ అయ్యింది.

ఈ నేపధ్యంలో చాలా మంది దర్శకులు రెట్రో స్టైల్ మాఫియా బ్యాక్ డ్రాప్ కథలని తెరకెక్కిస్తూ ఉన్నారు. మరి అలాంటి జోనర్ సినిమా కోసమే తారక్ ఈ లుక్ లోకి మరి ఉంటాడనేది నందమూరి అభిమానుల మాట.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.