Begin typing your search above and press return to search.

తారకరత్న భార్య.. మరో ఎమోషనల్ పోస్ట్

By:  Tupaki Desk   |   5 May 2023 11:27 PM IST
తారకరత్న భార్య.. మరో ఎమోషనల్ పోస్ట్
X
తారకరత్న అకాల మరణం అందరినీ కలచివేసింది. ఆయన రాజకీయాల్లో రాణించాలని కన్న కలలు కలలుగానే మిగిలిపోయాయి. టీడీపీ నేత లోకేష్ పాదయాత్రలో పాల్గొనడానికి వచ్చి గుండె ప్రమాదానికి గురయ్యారు. కొంతకాలం ఆస్పత్రిలో చికిత్స పొంది ఆ తర్వాత కన్నుమూశారు. ఆయన మరణం నందమూరి అభిమానులతో పాటు, టీడీపీ కార్యకర్తల్లోనూ విషాదం నింపింది. అభిమానులే ఇప్పటి వరకు ఆయన మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అలాంటిది ఆయనను ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య ఎలా జీర్ణించుకుంటుంది.

తారకరత్న, అలేఖ్యరెడ్డిది ప్రేమ పెళ్లి. మొదట వీరి పెళ్లిని పెద్దలు అంగీకరించలేదు. చాలా కాలం తర్వాత వీరి ప్రేమను పెద్దలు ఆశీర్వదించారు. ఈలోపే తారకరత్నకు నిండు నూరేళ్లు నిండిపోయాయి. వీరి ప్రేమ కథ తెలిసి చాలా మంది చలించిపోయారు. సినిమా కథను తలపిస్తుందంటూ భావించారు. కాగా, ప్రస్తుతం భర్తను కోల్పోయి ఒంటరిగా ఉన్న ఆమెపై ప్రతి ఒక్కరూ సానుభూతి తెలియజేస్తున్నారు.

తాజాగా, ఆమె తన భర్తపై తనకున్న ప్రేమను సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ఈ జన్మకు నువ్వు, నేను మాత్రమే, జీవితానికి సరిపడా మెమోరీస్ ఇచ్చివెళ్లావు’అని ఆమె పేర్కొన్నారు. తారకరత్నే తన లోకమని చెప్పుకొచ్చింది. తారకరత్న మెమోరీస్‌తోనే ఈ జీవితాంతం బతికేస్తాను అని, శ్వాస ఉన్నంత వరకు కూడా తారకరత్ననే ప్రేమిస్తుంటాను అని ఇలా అలేఖ్యా రెడ్డి ఎమోషనల్ పోస్ట్ వేసింది. ఇక పాత ఫోటో ఒకటి అలేఖ్య రెడ్డి షేర్ చేయగా.. అది ప్రస్తుతం వైరల్ అవుతోంది.

భర్త దూరమై ఆమె ఎంత బాధపడుతుందో ఆమె పెట్టిన పోస్టు చూస్తే అర్థమౌతోంది. దీంతో...నెటిజన్లు ఆమెకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కామెంట్ల రూపంలో తాము అండగా ఉన్నామని చెబుతున్నారు.

అంతకముందు, తారకరత్న మరణించిన తరువాత విజయసాయి రెడ్డి, బాలయ్య మాత్రమే తమకు అండగా ఉన్నట్టుగా అలేఖ్య రెడ్డి చెప్పుకొచ్చింది. తమకు అప్పుడూ ఇప్పుడూ అండగా నిలబడింది వాళ్లే అని అలేఖ్య తన ఇన్ స్టా పోస్టుల్లో షేర్ చేసుకుంది.