Begin typing your search above and press return to search.
టీజర్: చెప్పుతో తోలు తీసిందే!
By: Tupaki Desk | 28 July 2018 7:15 PM GMTసింగర్ టర్న్ డ్ నటి ఆండ్రియా వేడి పెంచడంలో ఎక్స్ పర్ట్ అన్న సంగతి తెలిసిందే. అందాల ఆరబోతలో ఈ భామ ముంబై భామలకు ఏమాత్రం తక్కువ కాదు. `యుగానికి ఒక్కడు` టైమ్ నుంచి తెలుగువారికి సుపరిచితమైన ఈ బోల్డ్ బ్యూటీ - ఇప్పుడు తారామణి సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తారామణి పోస్టర్లు - రెండు టీజర్లు ఇదివరకూ వేడి పెంచాయి. అదంతా అటుంచితే తాజాగా రిలీజైన టీజర్ 3 ఇంకా ఇంకా వేడి పెంచేస్తోంది. ఈ సినిమాలో అంజలి - ఆండ్రియా పోటీ పడి నటించారన్నది ఓ అప్‌డేట్.
తాజాగా రిలీజైన 3వ టీజర్ లో ఆండ్రియా ఒంటరిగా నడుచుకుంటూ వెళుతోంది. అక్కడ నలుగురు కొంటె కుర్రాళ్లు - పోకిరిగాళ్లు ఒంటరిగా వస్తున్న తనని పిలుస్తూ ఒకటే వెకిలి వేషాలు వేస్తున్నారు. వస్తావా? ఒక రాత్రికి 25 వేలు అంటూ ఆఫర్ చేసేస్తారు. ఇంకేం ఉంది తనకు చిర్రెత్తుకొచ్చింది. దగ్గరకు వెళ్లి చెప్పు తీసుకుని ఎడాపెడా వాయించేస్తుంది. అసలే వర్షం రాత్రి కొంటె కుర్రాళ్లకు ఓ రేంజులో పంచ్ పడింది. అదంతా సరే.. అలా కొట్టేసిన ఆండ్రియా ఓ ఒంటరి సింగిల్ మదర్. అదే ఈ సినిమాలో ట్విస్టు. ఇప్పటికే తమిళంలో రిలీజై క్రిటిక్స్ ప్రశంసలు అందుకున్న ఈ సినిమా తెలుగులోనూ రిలీజ్ కి వస్తోంది. ఈ సినిమాకి జాతీయ అవార్డు దర్శకుడు రాము దర్శకత్వం వహించారన్నది పెద్ద క్యూరియస్ పాయింట్.