Begin typing your search above and press return to search.
24 అదిరిందంటున్న టాప్ క్రిటిక్
By: Tupaki Desk | 5 May 2016 12:24 PM GMTఅసలే భారీ అంచనాలున్న సినిమా.. పైగా విడుదలకు ముందు రోజే ప్రివ్యూ షో చూసి.. ఓ పెద్ద క్రిటిక్ సినిమాను తెగ పొగిడేస్తూ ట్వీట్లు పెట్టేస్తే.. ఇక ఆ సినిమాకు అంతకంటే కావాల్సిందేముంది? ‘24’ విషయంలో అదే జరిగింది. ప్రముఖ బాలీవుడ్ క్రిటిక్ కమ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్.. ‘24’ ప్రివ్యూ షో చూసి.. ముగ్ధుడైపోయాడు. ఈ సినిమాపై ఓ రేంజిలో పొగడ్తలు గుప్పిస్తూ.. చాలా ఎగ్జైట్మెంట్ తో ట్వీట్లు గుప్పించాడు తరణ్. ‘24’ సినిమా గురించి ఆయన ఏమన్నాడంటే...
‘‘24 లాంటి సినిమా తీయాలంటే ఎంతో ధైర్యం.. నిబద్ధత.. సినిమాపై పట్టు ఉండాలి. అలాగే ఆర్థికంగానూ ఎంతో అండ ఉండాలి. 24 సినిమా టైటిల్స్ దగ్గర్నుంచే మీ దృష్టిని ఆకర్షిస్తుంది. 2 గంటల 40 నిమిషాల పాటు ఈ సినిమాకు అంకితమైపోతారు. కాన్సెప్టే 24 సినిమాకు ప్రధాన ఆకర్షణ. ఊహకందని ట్విస్టులు.. అపరిమితమైన వినోదం.. మిమ్మల్ని కట్టిపడేస్తాయి. నాటకీయ ఆరంభం.. సూర్య-సమంత మధ్య వచ్చే క్యూట్ లైట్ మూమెంట్స్.. అద్భుతమైన ఇంటర్వెల్ పాయింట్.. ఎమోషనల్ సన్నివేశాలు.. పతాక సన్నివేశం.. ఈ సినిమాకు ఇవే ప్రధాన ఆకర్షణలు.
మనం సినిమాను అద్భుతంగా మలిచిన విక్రమ్ కుమార్.. మరోసారి తన మాస్టర్ క్లాస్ చూపించాడు. 24 సబ్జెక్ట్ ను గొప్పగా డీల్ చేశాడు. మూడు భిన్నమైన పాత్రలు పోషించిన సూర్య అవార్డు విన్నింగ్ పెర్ఫామెన్స్ ఇచ్చాడు. ముఖ్యంగా అతను విలన్ పాత్రలో అదరగొట్టాడు’’ అని తరణ్ అన్నాడు. తరణ్ లాంటి టాప్ క్రిటిక్ ‘24’ గురించి ఇలా మాట్లాడాడంటే.. సినిమా ఓ రేంజిలో ఉంటుందన్నమాటే.