Begin typing your search above and press return to search.
#AMBపై తరుణ్ ఆదర్శ్ కామెంట్స్
By: Tupaki Desk | 3 Dec 2018 7:25 AM GMTమహేష్ బాబు, ఏషియన్ సునీల్ లు కలిసి నిర్మించిన ఏఎంబీ సినిమా తాజాగా కృష్ణ చేతుల మీదుగా ప్రారంభం అయిన విషయం తెల్సిందే. ఈ మల్టీప్లెక్స్ గురించి ఎంతో మంది ఆహా ఓహో అంటూ ప్రశంసిస్తూ పోస్ట్ చేస్తున్నారు. ఇటీవలే వర్మ ఈ మల్టీప్లెక్స్ మహేష్ బాబులా అందంగా ఉందని పేర్కొన్నాడు. తాజాగా ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ బాలీవుడ్ ట్రేడ్ ఎనలిస్ట్ తరుణ్ ఆదర్శ్ పాల్గొన్నాడు. జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న ఆయన ఏఎంబీపై ప్రశంసలు కురిపించడంతో దేశ వ్యాప్తంగా కూడా #AMB గురించిన చర్చ జరుగుతోంది.
ఏఎంబీలో మొత్తం ఏడు స్క్రీన్స్ ఉన్నాయి. ఆ ఏడు స్క్రీన్స్ కూడా విభిన్నంగా డిజైన్ చేసి ఉన్నాయట. మల్టీ ప్లెక్స్ ల్లో ఎక్కువగా అన్ని స్క్రీన్స్ సీటింగ్ మరియు ఇంటీరియర్ సేమ్ డిజైన్ ఉంటుంది. కాని ఏఎంబీలో మాత్రం ఏడు స్క్రీన్స్ కూడా ఏడు రకాలుగా ఉన్నాయంటూ తరుణ్ పేర్కొన్నాడు. మల్టీప్లెక్స్ లోని ఆర్కిటెక్ట్ చాలా అద్బుతంగా ఉందని, ప్రతి విషయంలో కూడా హై క్వాలిటీని మెయింటెన్ చేసి, అద్బుతమైన అభిరుచితో తీర్చి దిద్దినట్లుగా ఉందంటూ కొన్ని ఫొటోలను షేర్ చేశాడు.
ఏఎంబీ మల్టీప్లెక్స్ ప్రారంబోత్సవంకు తనను ఆహ్వానించినందుకు గాను మహేష్ దంపతులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పాడు. ఇంద్రలోకం వంటి మల్టీప్లెక్స్ అంటూ తరుణ్ ప్రశంసలు కురిపించడంతో అంతా కూడా ఏఎంబీకి ఒకసారి వెళ్లాలని అనుకుంటున్నారు. ఏడు స్క్రీన్స్ లలో ఆరు స్క్రీన్స్ ను రెగ్యులర్ సినిమాల ప్రదర్శణకు వినియోగించనున్నారు. ఒక స్క్రీన్ ను ప్రత్యేక షో లు వేయనున్నారు. మొత్తానికి హైదరాబాద్ కు ఏఎంబీ మల్టీప్లెక్స్ మరో మణిహారంగా నిలుస్తుంది.