Begin typing your search above and press return to search.
డైరెక్టర్లను ఆడుకుంటున్న స్టార్ హీరో
By: Tupaki Desk | 23 Jan 2022 5:26 AM GMTఓవైపు రాజకీయాలు.. మరోవైపు డెడ్ లైన్ల ప్రకారం సినిమాలు పూర్తి చేయడం.. ఇదీ ప్రముఖ టాలీవుడ్ హీరో కం రాజకీయ నాయకుడు ఆడే డబుల్ గేమ్. రెండు పడవల ప్రయాణంలో అతడు తలమునకలుగా ఉన్నారు. తన పార్టీని నిలబెట్టుకోవడానికి సినిమాలు చేసి సంపాదించడం తప్ప వేరే మార్గం లేదని ఇంతకుముందే చెప్పకనే చెప్పిన సదరు అగ్ర హీరో కం నాయకుడు ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ కరోనా భయాల్ని కూడా ఖాతరు చేయకపోవడం చర్చనీయాంశమైంది.
ఇకపోతే రాజకీయాలకు తగిన సమయం కేటాయించేందుకు అతడికి అవకాశం లేనంతగా సినిమాల షెడ్యూళ్లు ప్యాక్ అయ్యి ఉండడం ఇప్పుడు ఆ పార్టీ అభిమానుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే పార్టీ బలోపేతానికి అతడి సామాజిక వర్గం ఎంతో ఉత్సుకతతో ఉండడంతో 2024 లేదా ముందస్తు పేరుతో 2023లో జరిగే ఎన్నికలకు సమాయత్తమవుతోంది.
సదరు సామాజిక వర్గ వాట్సాప్ గ్రూపుల్లో తమ ప్రతినిధి అయిన ప్రముఖ హీరోని ప్రమోట్ చేసేందుకు ఒక పెనుయుద్ధమే జరుగుతోంది. ఇటీవలి కాలంలో ప్రతిపక్ష పార్టీ వీక్ అన్న లెక్కలతో ఇప్పుడు ఆ హీరోలో మరింత ఉత్సాహం కనిపిస్తోంది. ముందస్తు ఎన్నికలకు వెళితే గనుక తన ప్రభావం ఆ రాష్ట్రంలో స్పష్ఠంగా ఉంటుందని బలమైన నమ్మకంతో ఉన్నారు.
ఇదంతా సరే కానీ.. ఇప్పటికిప్పుడు సెట్స్ పై ఉన్న రెండు సినిమాలు.. సెట్స్ కెళ్లాల్సిన మరో రెండు సినిమాల సన్నివేశమేమిటీ? అంటే.. అందులో సెట్స్ పై ఉన్న సినిమా ఆల్మోస్ట్ పూర్తయింది. సగం పూర్తయిన మరో భారీ పాన్ ఇండియా చిత్రాన్ని 40రోజుల్లో తన పార్ట్ పూర్తి చేసేందుకు డెడ్ లైన్ విధించారట. దీంతో దర్శకుడు నానా హైరానా పడుతున్నారని తెలిసింది. ఆ తర్వాత కూడా ఇద్దరు దర్శకులకు చెరో 60రోజుల కాల్సీట్లు ఇస్తారు.
ఇవి రెండూ కూడా వేగంగా పూర్తవ్వాలనేది కండీషన్. అంటే 120 రోజుల్లో చకచకా పనులన్నీ పూర్తవ్వాలి. ఎవరి షెడ్యూల్స్ వారికి ఇప్పటికే ఫైనల్ చేసేందుకు సదరు హీరో సంసిద్ధంగా ఉన్నారు. ఈ సినిమాలు కూడా ఆ ఇద్దరికీ చాలా ఇంపార్టెంట్ కావడంతో పకడ్భందీగానే ప్లాన్ చేస్తున్నారు. 2022 చివరి నాటికి సినిమాల్ని పూర్తి చేసి అటుపై 2023 ఆద్యంతం రాజకీయాల్లో దూసుకెళ్లాలన్నది సదరు హీరో కం నాయకుడి బిగ్ ప్లాన్ అని తెలిసింది. మరోవైపు ఇతర పార్టీలతో పొత్తుల గురించిన చర్చోపచర్చలు సాగుతున్నాయన్న గుసగుసలు ఉన్నాయి. ప్రస్తుతానికి డెడ్ లైన్లు విధించి డైరెక్టర్లను ఆడుకుంటున్నారన్న టాక్ కూడా బలంగా వినిపిస్తోంది.