Begin typing your search above and press return to search.
'ఈ నగరానికి ఏమైంది' అనబోతున్నది వీళ్ళే.
By: Tupaki Desk | 31 May 2018 1:25 PM GMTసినిమా హిట్ అవ్వాలంటే భారీగా డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు, మంచి కథ బోలెడంత ఎంటర్టైన్మెంట్ ఉన్నా చాలు అని నిరూపించి చిన్న సినిమాలకు ఒక ఇన్స్పిరేషన్ గా మారిన చిత్రమే పెళ్లి చూపులు. ఆ సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత దర్శకుడు తరుణ్ భాస్కర్ ఎలాంటి సినిమా చేస్తున్నాడు అని అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు.
'ఈ నగరానికి ఏమైంది' అనే వైవిధ్యమైన టైటిల్ తో మళ్ళీ మన ముందుకు ఒక కొత్త సినిమాను తీసుకురాబోతున్న తరుణ్ భాస్కర్ ఈ మధ్యనే మీడియాతో మాట్లాడుతూ తన సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు మాత్రమే కాక అందులో యాక్టర్ ల పాత్రలు కూడా ఎలా ఉండబోతున్నాయి అని ఓవర్ వ్యూ ఇచ్చాడు. సినిమా అంతా నలుగురు స్నేహితుల గురించి నడుస్తుందట. అందులో మొదటివాడు కార్తిక్ (సుశాంత్ రెడ్డి). ఒక పేరు మోసిన పబ్ లో మేనేజర్ గా పని చేస్తుంటాడు. వైన్ టెస్టింగ్ బాగా చేయగలడు కానీ మంచి స్నేహితులను మాత్రం ఎంచుకోలేడు. రెండవ వాడు వివేక్ (విశ్వక్సేన్ నాయుడు). ఇతను కార్తిక్ కు బెస్ట్ ఫ్రెండ్. ముందుకు బాగా ఎడిక్ట్ అయిన వ్యక్తి కానీ ఆ విషయాన్ని చచ్చినా ఒప్పుకోడు.
ఇకపోతే మూడవ వాడు ఉప్పు (వెంకటేష్ కాకుమాను). ఇతను ఒక వెడ్డింగ్ ఫిల్మ్ ఎడిటర్. బార్ కి వెళ్లి మిల్క్ షేక్స్ - సాఫ్ట్ డ్రింక్స్ ఆర్డర్ చేసే రకం. నాలుగవ వాడు కూడా కామెడీ కారెక్టరే. కౌశిక్ వెర్షన్ 2.0 (అభినవ్ గౌతమ్). ఇలా ఈ నలుగురి గురించి ఇంట్రడక్షన్ ఇచ్చి అనిషా ఆంబ్రోస్ - సిమ్రాన్ చౌదరి ముఖ్యపాత్రలు పోషించారని చెవుతున్నాడు తరుణ్ భాస్కర్. సురేష్ బాబు నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ జూన్ ఆఖరులో లేక జులై మొదట్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాకు వివేక్ సాగర్ మ్యూజిక్ అందించగా - నికేత్ బొమ్మిరెడ్డి సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు.