Begin typing your search above and press return to search.
పెళ్లి చూపులు డైరెక్టర్.. బొద్దింకలతో కోలా క్రీడ!
By: Tupaki Desk | 24 Jun 2022 4:00 AM GMTకొన్ని టైటిళ్లు విచిత్రంగా ఉంటాయి. అయితే ఆ విచిత్రం వెనక ఎన్నో అర్థాలు ప్రతిధ్వనిస్తుంటాయి. ఇప్పుడు 'పెళ్లి చూపులు' ఫేం తరుణ్ భాస్కర్ ఎంపిక చేసుకున్న టైటిల్ ఇంచుమించు అలానే ఉంది. ఈ టైటిల్ కి టీమ్ ఇచ్చిన వివరణ కూడా అంతే సందేహాలు రేకెత్తించింది. ఇంతకీ ఏమా టైటిల్ కథ? అంటే.. వివరాల్లోకి వెళ్లాలి.
ట్యాలెంటెడ్ యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ దాస్యం ఇప్పటివరకు రెండు చిత్రాలకు దర్శకత్వం వహించాడు. పెళ్లిచూపులు- ఈ నగరానికి ఏమైంది? చిత్రాలతో తనదైన మార్క్ వేసాడు.పెళ్లి చూపులు పెద్ద సక్సెస్ సాధించడమే గాక ఈ సినిమాలో ఆర్టిస్టులందరికీ మంచి కెరీర్ దక్కింది.
తెరకెక్కించిన తొలి సినిమాతోనే జాతీయ అవార్డును చూడగలిగింది తరుణ్ భాస్కర్ టీమ్. చక్కని కామిక్ టైమింగ్ నైజాం యాసతో యూత్ ఫుల్ సినిమాలను తీయడంలో స్పెషలిస్ట్ అయిన తరుణ్ భాస్కర్ ఈసారి క్రైమ్ కామెడీని తెరకెక్కిస్తున్నాడు.
ఇది VG సైన్మా బ్యానర్ లో మొట్టమొదటి ఫీచర్ లెంగ్త్ మూవీ. మేకర్స్ ప్రాజెక్ట్ తో పాటు టైటిల్ ని కూడా ప్రకటించారు. ఈ చిత్రానికి 'కీడా కోలా' అనే టైటిల్ ను పెట్టారు. కీడా మీనింగ్ ఆసక్తిని కలిగిస్తోంది.
కీడా అంటే ఆరు కాళ్లు ఉన్న జీవి .. కోలా అనేది ప్రముఖ శీతల పానీయాల బ్రాండ్ పేరు. పోస్టర్ లో శీతల పానీయాల సీసా మూత(కప్)పై టైటిల్ రాసి ఉంది. క్రైమ్ కథనానికి సింబాలిగ్గా ఎగసిపడుతున్న కోలా రక్తాన్ని పోస్టర్ లో వేసారు. కోలా మూత కిందనే మనం ఆరు కాళ్ల జీవిని కూడా చూడొచ్చు. ''మునుపెన్నడూ లేని విధంగా క్రైమ్ కామెడీని అనుభవించండి..'' అంటూ మేకర్స్ రక్తి కట్టించే క్యాప్షన్ కూడా వేసారు.
సెంటిమెంట్ ప్రకారం ఈ పోస్టర్ కు పసుపు రంగు వేశారు. పెళ్లి చూపులు- ఈ నగరానికి ఏమైంది? పోస్టర్లు కూడా ఎల్లో కలర్ లో డిజైన్ చేశారనేది ఈ పోస్టర్ కలర్ గుర్తు చేస్తోంది. భరత్ కుమార్-శ్రీపాద్ నందిరాజ్- ఉపేంద్ర వర్మ- శ్రీనివాస్ కౌశిక్- సాయికృష్ణ గద్వాల్- విజయ్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రం 2023లో విడుదల కానుంది. ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు- సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. తరుణ్ భాస్కర్ దాస్యం రచన & దర్శకత్వంతో మేకింగ్ పరంగా కీలకమైన పాత్రను పోషిస్తున్నారు. క్విక్ ఫాక్స్ రైటర్స్ రూమ్ రచనా విభాగంలో పని చేసింది.