Begin typing your search above and press return to search.

ఈ డైరెక్టర్ కి ఏమైంది?

By:  Tupaki Desk   |   15 July 2018 6:56 AM GMT
ఈ డైరెక్టర్ కి ఏమైంది?
X
పెళ్లి చూపులు తర్వాత రెండేళ్లు గ్యాప్ తీసుకుని దర్శకుడు తరుణ్ భాస్కర్ రూపొందించిన ఈ నగరానికి ఏమైంది యూత్ ని కొంత వరకు మెప్పించినా అన్ని వర్గాల ప్రేక్షకులను టార్గెట్ చేయలేదు. కాబట్టే ఆశించిన ఫలితం పూర్తి స్థాయిలో దక్కించుకోలేకపోయింది. మొదటి సినిమా మేజిక్ ని రిపీట్ చేయటంలో తరుణ్ భాస్కర్ సక్సెస్ కాలేదనే కామెంట్స్ ఎక్కువగా వినిపించాయి. ఇది చిన్న ఐడియాని బేస్ చేసుకుని హాలీవుడ్ బాలీవుడ్ సినిమాల స్ఫూర్తితో తీశానని తను ఒప్పుకున్నప్పటికీ ఈ మాత్రం దానికి రెండేళ్ల గ్యాప్ అవసరమా అనే విమర్శలు కూడా వచ్చాయి. కాకపోతే పెట్టిన తక్కువ పెట్టుబడికి ఇది రిస్క్ ప్రాజెక్ట్ లా కాకుండా ఓ మోస్తరు లాభాలతోనే బయటపడింది. ఇప్పుడు ఈ క్రియేటివ్ డైరెక్టర్ మూడో సినిమా ఎవరితో అనే చర్చ ఇప్పుడు మొదలైంది. సురేష్ సంస్థతో తన అనుబంధం గట్టి పడిందని అందులోనే చేయాలనుందని ప్రమోషన్ ఈవెంట్స్ లో చెప్పుకున్న తరుణ్ భాస్కర్ అడుగులు ఆ దిశగా పడుతున్నట్టుగా కనిపించడం లేదు.

దానికి తోడు బయటి నిర్మాతలు ఎవరూ తరుణ్ భాస్కర్ ని పిలవడం లేదని వినికిడి. ఈ నేపధ్యంలో సురేష్ బాబుకే మరో కథ వినిపిస్తాడా లేక స్వంతంగా తన బ్యానర్ లో ఏదైనా చేసుకుంటాడా అనేది భేతాళ ప్రశ్న. సురేష్ సంస్థతో వ్యవహారం అంత ఈజీ కాదు. త్వరపడి సురేష్ బాబు ఏది తీయడు. పైగా ఇప్పుడు రెండు మూడు క్రేజీ సినిమాలతో మహా బిజీగా ఉన్నాడు. తరుణ్ భాస్కర్ చెప్పింది ఏదైనా నచ్చినా సెట్స్ పైకి వెంటనే తీసుకెళ్లలేకపోవచ్చు. సో వేరే ఆప్షన్ చూసుకునే దిశగా తరుణ్ ఆలోచనలు ఉన్నాయని సన్నిహితుల సమాచారం. ఇదంతా ఒక కొలిక్కి వచ్చేసరికి టైం పట్టేలా ఉంది. ఏదైనా తన క్యాలిబర్ ని మరోసారి గట్టిగా నిరూపించుకునే బాధ్యత అయితే తరుణ్ భాస్కర్ మీద ఉంది. కాకపోతే ఇలా ఆలస్యంగా రెండేళ్లకో చిన్న సినిమా తీస్తూ కూర్చుంటే కెరీర్ లో పాతిక సినిమాలు చేయాలంటే యాభై ఏళ్ళు పడుతుంది. కానీ సృజనాత్మకత ఉన్న ఇలాంటి దర్శకులు అలా చేయటం కరెక్ట్ కాదు