Begin typing your search above and press return to search.

అవార్డ్ రాలేదని ట్రాప్ లో పడను

By:  Tupaki Desk   |   31 March 2017 5:37 PM GMT
అవార్డ్ రాలేదని ట్రాప్ లో పడను
X
గతేడాది రిలీజ్ అయిన సినిమాల్లో బెస్ట్ అనదగ్గ వాటిలో ఒకటిగా నిలిచిన మూవీ పెళ్లి చూపులు. చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయం సాధించేసి.. పెట్టుబడితో పోల్చితే అత్యధిక లాభాలు అందించిన మూవీగా పెళ్లి చూపులు రికార్డు సృష్టించింది. అయితే.. పెళ్లిచూపులు సెన్సేషన్స్ అక్కడితోనే ఆగిపోయాయని చెప్పాలి.

ఎందుకంటే.. ఆ చిత్రానికి తర్వాత గుర్తింపు రాలేదు. విభిన్నమైన చిత్రాన్ని అందించిన దర్శకుడు తరుణ్ భాస్కర్ ను జనాలు గుర్తించినా.. అవార్డులు ఇచ్చేవారు విస్మరించారు. ఇది తరుణ్ ని బాగా బాధ పెట్టేసింది. మంచి సినిమాకు కాకుండా.. స్టార్ హీరోల ఫ్యాన్స్ ను మెప్పించడానికే అవార్డ్ ఫంక్షన్స్ చేస్తున్నారంటూ.. తన ఫేస్ బుక్ అకౌంట్ లో ఓ సుదీర్ఘమైన లేఖను రాసి పోస్ట్ చేశాడు. నిజానికి తాజాగా జరిగిన ఐఫా అవార్డుల ఉత్సవంలో బెస్ట్ కమెడియన్ అవార్డ్ తప్ప.. వేరే ఎక్కడా పెళ్లిచూపులు చిత్రాన్ని ఎవరూ పట్టించుకోలేదన్నది ఆశ్చర్యకరమైన వాస్తవమే.

అయతే.. అవార్డులు రానంత మాత్రాన.. తాను తన పంథా మార్చుకోనన్న దర్శకుడు తరుణ్ భాస్కర్.. ఎట్టిపరిస్థితుల్లోనూ స్టార్స్ ఉచ్చులో పడబోనని అంటున్నాడు. తన స్టైల్ లో క్వాలిటీ సినిమాలు తీస్తాను తప్ప.. అవార్డుల కోసం గుర్తింపు కోసం సినిమాలు చేయనన్నాడు. ఇంత క్లారిటీ ఉన్నపుడు.. మళ్లీ ఇన్ని కామెంట్స్ ఎందుకనేది ఇంకా ఆశ్చర్యపోవాల్సిన విషయం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/