Begin typing your search above and press return to search.

ఇప్పుడే స్టార్ల జోలికి వెళ్లడట

By:  Tupaki Desk   |   17 Aug 2016 5:30 AM GMT
ఇప్పుడే స్టార్ల జోలికి వెళ్లడట
X
టాలీవుడ్ లో పెళ్లిచూపులు హవా ఇంకా ఏ మాత్రం తగ్గలేదు. తక్కువ బడ్జెట్ తో కొత్త నటులు - టెక్నీషియన్స్ తో తెరకెక్కిన ఈ మూవీలో కనిపించిన ఫ్రెష్ నెస్.. ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుంటోంది. సినిమా వాళ్లనే కాదు.. కేటీఆర్ లాంటి రాజకీయనాయకులు కూడా ఈ సినిమా చూసి పొగడకుండా ఉండలేకపోతున్నారు. చాలామంది సినిమా తారలు స్పెషల్ గా ప్రెస్ మీట్లు పెట్టి మరీ పెళ్లిచూపులు మూవీని.. ఆ చిత్రాన్ని దర్శకుడు తరుణ్ భాస్కర్ ని విపరీతంగా ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఈ రేంజ్ సక్సెస్ సాధించిన తర్వాత.. ఏ కొత్త దర్శకుడైనా నెక్ట్స్ లెవెల్ కి వెళ్లిపోదామని ట్రై చేస్తాడు. నిర్మాతలు కూడా మంచి ఆఫర్లతోనే ముందుకొస్తారు. కానీ ఈ దర్శకుడి వ్యూ మాత్రం వేరేలా ఉంది. ఇప్పుడే స్టార్ల జోలికి వెళ్లనంటున్నాడు. 'ముందు నేను ఓ జీవితం జీవించాలి. నేను జీవితాన్నే సినిమాగా మలచాలని అనుకుంటున్నా. గతంలో సైన్మా అనే షార్ట్ ఫిలిం తీశాను. ఇప్పుడు ఆ సబ్జెక్ట్ నే పూర్తి స్థాయి సినిమాగా మలచాలని అనుకుంటున్నా' అని చెప్పాడు తరుణ్ భాస్కర్

తెలంగాణ ప్రజల జీవితాలకు సంబంధించిన ఈ సబ్జెక్ట్ ను.. పలు కేరక్టర్లతో వినోదాత్మకంగా మలచనున్నాడట. ఇది మాల్గుడి డేస్ టైపులో ఉంటుందని చెప్పాడు. ఈ చిత్రాన్ని తప్ప.. ఇప్పట్లో పెద్ద స్టార్లతో సినిమా తీసే ఆలోచన లేదని తేల్చేశాడీ ట్యాలెంటెడ్ డైరెక్టర్. ఒకవేళ ఆ సబ్జెక్ట్ తో రెండో సక్సెస్ కూడా సాధిస్తే.. ఇక ఇతగాడికి డిమాండ్ మామూలుగా ఉండదు లెండి.