Begin typing your search above and press return to search.
ఎన్టీఆర్ తో కలవడంలో ఏముంది?
By: Tupaki Desk | 22 Jun 2018 5:28 PM GMTయంగ్ సెన్సేషనల్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్.. ఇప్పుడు మళ్లీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాడు. పెళ్లి చూపులు మూవీతో ఈ దర్శకుడు సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. ఆ తర్వాత పెద్ద హీరోలతో సినిమా చేసే అవకాశం ఉన్నా.. మరోసారి కొత్తవాళ్ల తోనే 'ఈ నగరానికి ఏమైంది' అంటూ మూవీ చేసి అందరి దృష్టినీ ఆకట్టుకోగా.. ఈ మూవీ వచ్చే వారంలో విడుదల కానుంది.
తన కొత్త సినిమా రిలీజ్ మరో వారం రోజుల్లో ఉందనగా.. ఇప్పుడీ దర్శకుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను కలుసుకున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అరవింద సమేత చిత్రం షూటింగ్ లో ఉన్న ఎన్టీఆర్ దగ్గరకు తనే వెళ్లాడు తరుణ్ భాస్కర్. అంతే కాదు.. వీరిద్దరూ చాలాసేపు చర్చలు నిర్వహించడం అందరినీ ఆశ్చర్యం కలిగించింది. కొత్త దర్శకులను ఎంకరేజ్ చేయడంలో ఎన్టీఆర్ ఎంత యాక్టివ్ గా ఉంటాడో తెలిసిందే. అలాంటిది కేవలం రెండు సినిమాల అనుభవం ఉన్న దర్శకుడితే ఎన్టీఆర్ డిస్కషన్స్ అంటే.. కచ్చితంగా ఏదో కొత్త ప్రాజెక్టు అవకాశం గురించే అనుకుంటున్నారు ఇండస్ట్రీ జనాలు.
అయితే.. ఇక్కడ మరో వెర్షన్ కూడా వినిపిస్తోంది. సరిగ్గా సినిమా విడుదలకు ముందు ఇలా స్టార్లను కలవడం ద్వారా ఉచితంగా పబ్లిసిటీ అందుకునే అవకాశం ఉంటుందనే టెక్నిక్ ను ఫాలో అవుతున్నాడని అంటున్నారు. పెళ్లి చూపులు గ్రాండ్ సక్సెస్ విషయంలో కూడా.. స్టార్లు అందరూ ముక్తకంఠంతో పొగడడం కీలకమైన కారణంగా నిలిచిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.