Begin typing your search above and press return to search.
బిగ్ బాస్ లో పాల్గొనడం లేదు.. హీరో ప్రకటన..
By: Tupaki Desk | 31 May 2018 12:42 PM GMTనేచురల్ స్టార్ నాని వ్యాఖ్యాతగా ప్రారంభం కానున్న బిగ్ బాస్ 2కు ముహూర్తం ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. జూన్ 10 నుంచి ఈ కార్యక్రమం ప్రేక్షకులను అలరించనుంది. అయితే ఇప్పటికే ఈ కార్యక్రమంలో పాల్గొనే సెలబ్రెటీలు, బిగ్ బాస్ హౌస్ సహా అన్నీ సిద్ధమయ్యాయి. ఓ 16మంది సెలబ్రెటీలు ఈ షోలు పొల్గొంటున్నట్టు మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.. అయితే తాజాగా ఓ హీరో బిగ్ బాస్ షోలో తాను పాల్గొనడం లేదని ప్రకటన జారీ చేశారు.
బిగ్ బాస్ షోలో తాను పాల్గొంటున్నట్లు వస్తున్న వార్తలపై హీరో తరుణ్ స్పందించారు. తాను బిగ్ బాస్ షోలో పాల్గొనడం లేదని ఈరోజు మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. దీంతో తరుణ్ పై వస్తున్న ఊహాగానాలకు తెరపడింది..
గడిచిన బిగ్ బాస్ సీజన్-1... 70 రోజులు మాత్రమే కొనసాగింది. కానీ ఈ సీజన్ 2 వందరోజులు నిర్వహించాలని ప్లాన్ చేశారు. ఈ సీజన్ లో మొత్తం 16మంది సెలబ్రెటీలు పాల్గొంటారు. ప్రతి శని - ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు, ప్రతి సోమ వారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 9.30 గంటలకు ఈ కార్యక్రమం ప్రసారం కానుంది. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనే సెలబ్రెటీల విషయంలో మాత్రం సదురు టీవీ చానెల్ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయడం లేదు. దీంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ 16మంది సెలబ్రెటీల లిస్ట్ ఫేక్ అని అర్థమవుతోంది. తాజాగా తాను పాల్గొనడం లేదని తరుణ్ వివరణ ఇవ్వడంతో ఈ విషయం స్పష్టమైంది.