Begin typing your search above and press return to search.

తరుణ్ లవ్ స్టోరీకి వేళయిందా!!

By:  Tupaki Desk   |   4 July 2017 4:17 AM GMT
తరుణ్ లవ్ స్టోరీకి వేళయిందా!!
X
లవర్ బోయ్ ఇమేజ్ తో దూసుకుపోయిన తరుణ్ కెరీర్ లో.. మంచి సినిమాలే ఉంటాయి. చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి హీరోగా ఎదిగిన వ్యక్తి కావడంతో.. అభిమానులు కూడా బాగానే ఉంటారు. కానీ రాన్రానూ ఆశించిన స్థాయిలో ఫ్యాన్స్ ను మెప్పించలేకపోగా.. తను కూడా సినిమాలపై ఫోకస్ తగ్గించి.. బాగా గ్యాప్ తీసేసుకున్నాడు తరుణ్.

మళ్లీ తన ఇమేజ్ ను తిరిగి సొంతం చేసుకోవాలన్నది తరుణ్ ఆలోచన. ఇందుకోసం మళ్లీ తనకు స్ట్రెంగ్త్ అయిన లవ్ స్టోరీనే బేస్ గా చేసుకుని ఓ మూవీ చేశాడు. 'ఇది నా లవ్ స్టోరీ' అంటూ ఓ సినిమా చేసిన తరుణ్.. ఆ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు సరైన డేట్ కోసం చూస్తున్నాడు. చాలాకాలం క్రితమే షూటింగ్ ప్రారంభమైన ఈ చిత్రం.. ఇప్పుడు విడుదలకు సిద్ధంగానే ఉంది. అయితే.. రిలీజ్ డేట్ విషయంలో సరైన టైం కోసం చూస్తున్నాడు నిర్మాత. ఒవియా ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించగా.. రమేష్ గోపీ దర్శకత్వంలో రూపొందిన మూవీ ఇది నా లవ్ స్టోరీ.

రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ కు మంచి స్పందన రావడంతో తరుణ్ అండ్ టీం ఊపిరి పీల్చుకుంది. త్వరలోనే ఇది నా లవ్ స్టోరీని విడుదల చేయనున్నామని.. మరికొన్ని రోజుల్లో విడుదల తేదీ ప్రకటిస్తామని చెప్పాడు దర్శకుడు. ఈ మూవీతో ఎలాగైనా స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్న తరుణ్.. ఇది నా లవ్ స్టోరీ సక్సెస్ కోసం తెగ ప్రమోషన్స్ చేసేయాలని డిసైడ్ అయ్యాడట. ఈ మూవీ పనుల్లో ప్రతీ అంశాన్ని దగ్గరుండి చూసుకుంటున్నాడట తరుణ్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/