Begin typing your search above and press return to search.
తరుణ్ కు పబ్బుల్లో పార్టనర్ షిప్ లేదంట
By: Tupaki Desk | 24 July 2017 4:30 AM GMTడ్రగ్స్ కేసు విచారణలో భాగంగా సిట్ ముందుకు విచారణకు హాజరైన సినీ నటుడు తరుణ్ తాజాగా ఒక ప్రెస్ రిలీజ్ చేశారు. సిట్ విచారణకు హాజరై.. దాదాపు పదమూడున్నర గంటల పాటు విచారణను ఎదుర్కొన్నారు. విచారణలో భాగంగా తరుణ్ ఏం చెప్పారన్న విషయానికి సంబంధించి మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వెలువడ్డాయి. అదే సమయంలో తరుణ్ కు సంబంధించి పలు విషయాల్ని ప్రస్తావించారు.
మీడియాలో తనపై వచ్చిన వార్తలపై తరుణ్ స్పందించారు. తనపై వస్తున్న ఆరోపణల్లో ఏ మాత్రం వాస్తవం లేదన్న వాదనను ఆయన వినిపించారు. తనకు ఏ పబ్బులోనూ భాగస్వామ్యం లేదని స్పష్టం చేసిన ఆయన.. తాను వారానికి ఒక రోజు గోవాకు వెళతానన్న తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు. ఈ వార్తలో నిజం లేదని.. ఇలాంటి వార్తల వల్ల తమ కుటుంబ సభ్యులు చాలా బాధ పడుతున్నారన్నారు.
మీడియా అంటే తనకు చాలా గౌరవం ఉందని.. ఇదే మీడియా కారణంగా తానీ రోజున ఈ స్థానంలో ఉన్నానని చెప్పిన తరుణ్.. తాజాగా వస్తున్న వార్తల కారణంగా తన తల్లి.. తండ్రి.. సోదరి చాలా పీల్ అవుతున్నారని చెప్పారు. దయచేసి తప్పుగా వార్తలు రాయొద్దన్న తరుణ్.. అధికారులు అడిగిన ప్రశ్నలన్నింటికి సమాధానం చెప్పానని పేర్కొన్నారు. తన ప్రెస్ రిలీజ్ లో చివర్లో తరుణ్ అద్భుతమైన వాక్యంతో ముగింపునిచ్చారు. అదేమంటే.. సమాజంలో డ్రగ్స్ నిర్మూలనకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇదే పని తరుణ్ మొదట్నించి చేసి ఉంటే.. ఈ రోజు సిట్ ముందు డ్రగ్స్ విచారణకు హాజరయ్యే పరిస్థితే వచ్చేదా? అన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.