Begin typing your search above and press return to search.
ఘోర విమాన ప్రమాదం.. హీరో దుర్మరణం!
By: Tupaki Desk | 31 May 2021 6:24 AM GMTఅమెరికాలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ప్రముఖ నటుడు జో లారా దుర్మరణం పాలయ్యారు. ‘టార్జాన్’ సిరీస్ లతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న లారా.. అకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలచివేస్తోంది. ఈ ప్రమాదంలో ఆయన భార్య కూడా ప్రాణాలు కోల్పోవడం విషాదకరం.
జో లారా, ఆయన భార్య గ్వెన్ షాంబ్లిన్ తోపాటు మరో ఐదుగురు ప్రయాణికులు ఓ ప్రైవేటు జెట్ విమానంలో ప్రయాణిస్తుండగా ఈ దుర్ఘటన జరిగినట్టు తెలుస్తోంది. స్థానిక కాలమానం ప్రకారం శనివారం ఉదయం 11 గంటలకు ఫ్లోరిడాలోని టేనస్సీ విమానాశ్రయం నుండి ఈ బయలుదేరింది. అమెరికా నగరమైన నాష్విల్లె సమీపంలోకి రాగానే అక్కడి సరస్సులో విమానం కూలిపోయింది.
విషయం తెలుసుకున్న రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. అయితే.. ఈ ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న ఏడుగురు చనిపోయినట్టు గుర్తించారు. ఈ విషయాన్ని ఫెడరల్ ఏవియేషన్ అడ్మిస్ట్రేషన్ ధృవీకరించింది.
అయితే.. ఈ ప్రమాదానికి గల కారణం ఏంటన్నది తెలియరాలేదు. ప్రభుత్వ ఆదేశాల మేరకు దర్యాప్తు బృందాలు రంగంలోకి దిగాయి. ఈ విషయం తెలుసుకున్న జో లారా అభిమానులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. ప్రస్తుతం లారా వయసు 58 సంవత్సరాలు. ఆయన నటించిన ‘టార్జాన్ ఇన్ మాన్ హట్టన్’ ప్రపంచ వ్యాప్తంగా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత వచ్చిన సినిమాలు కూడా ఆకట్టుకున్నాయి. ‘స్టీల్ ఫ్రాంటియర్స్’ ‘సన్‌సెట్ హీట్స్’ ‘ఆపరేషన్ డెల్టా ఫోర్స్’ వంటి ఎన్నో చిత్రాలు అలరించాయి.