Begin typing your search above and press return to search.
చై సామ్ ల ప్రేమను బయట పెట్టిన టాటూలు
By: Tupaki Desk | 2 Oct 2021 3:29 PM GMTటాలీవుడ్ మోస్ట్ బ్యూటీఫుల్ కపుల్ గా సమంత నాగచైతన్యలు నిలిచారు. వారు మనం సినిమాలో నటించిన తీరు.. వారి పాత్రలను చూసిన తర్వాత వీళ్లు నిజంగా భార్య భర్తలు అయితే బాగుంటుంది కదా అని చాలా మంది భావించారు. ఇద్దరు కూడా చాలా అందమైన క్యూట్ కపుల్ గా పేరు దక్కించుకున్నారు. పెళ్లి అయిన నాలుగు ఏళ్లలో వీరు ఎన్నో సార్లు మీడియాలో కలిసి వావ్ అనేంత అందంగా అందరి కంట పడ్డారు. ఇద్దరు కూడా ఎప్పుడు కూడా నవ్వుతూ ఉండటం మాత్రమే కాకుండా ఇద్దరు కలిసి సినిమాలు చేశారు... ఇద్దరు కలిసి కమర్షియల్స్ కూడా చేశారు. పెళ్లి తర్వాత వీరిద్దరు కలిసి చేసిన ప్రతి ప్రాజెక్ట్ మంచి సక్సెస్ ను దక్కించుకుంది. వీరిద్దరి సుదీర్ఘ ప్రేమకు పెళ్లితో మరింత అనుబంధంను జోడించారు. కాని వీరి అన్యోన్యమైన సంసార జీవితంను విడాకులతో వదిలేశారు. చాలా కాలం ప్రేమించుకున్న వీరిద్దరి గురించి మొదట అందరికి తెలిసింది టాటూ వల్ల.
ఇద్దరు కూడా ఒకే రకమైన టాటూలు వేసుకోవడంతో పాటు ఇద్దరు కూడా పదే పదే కలుసుకోవడం జరిగింది. ఒక సందర్బంలో ఇద్దరి టాటూలు బయటకు రావడంతో ప్రేమ విషయాన్ని ఒప్పుకోవాల్సి వచ్చింది. చాలా కాలం పాటు ఇద్దరు కూడా ప్రేమలో ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి. ఆ వార్తలను కొట్టి పారేయక పోవడంతో టాటూలు కూడా వేయించుకున్న నేపథ్యంలో ఇక ఇద్దరి పెళ్లి అన్నట్లుగా వార్తలు వచ్చాయి. అనూహ్యంగా ఇద్దరు కూడా తమ ప్రేమ విషయాన్ని ప్రకటించారు. ఇద్దరు కూడా ప్రేమించుకుంటున్నట్లుగా ప్రకటించి అంగరంగ వైభవంగా వివాహ నిశ్చితార్థం చేసుకోవడం జరిగింది. పెళ్లి కూడా గోవాలో అత్యంత వైభవంగా రెండు కుటుంబాల కన్నుల పండుగ అన్నట్లుగా జరిగింది.
టాటూలు వేయించుకునేంత ప్రేమ ఉన్న ఇద్దరు కూడా విడిపోవడం ఏంటీ అంటూ అంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో అభిమానులు మరియు శ్రేయోభిలాషులు కూడా కలిసి ఉంటే బాగుండేది అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారి వ్యక్తిగత విషయం అయినా కూడా ప్రతి ఒక్కరి ఇంట్లో మనుషుల మాదిరిగా వారు మారిపోయారు. అందుకే వారు విడాకులు తీసుకున్నారు అంటే ఏ ఒక్కరు నమ్మలేక పోవడంతో పాటు ఆ వార్తలు పుకార్లే అయితే బాగుండు అనుకుంటున్నారు. మొత్తానికి చేదు నిజం అయినా కూడా తప్పని పరిస్థితులు చైతూ సామ్ లు తమ వివాహ బంధంకు ఫుల్ స్టాప్ పెట్టేశారు. అప్పట్లో ఒకరంటే ఒకరు ఎంతో ప్రేమను చూపించుకున్నారు.. మరి ఇప్పుడు ఏ విషయంలో వీరిద్దరి మద్య గొడవలు వచ్చాయి అనేది చర్చనీయాంశంగా మారింది. ఎవరికి తోచినట్లుగా వారు ఊహించేసుకుంటున్నారు.