Begin typing your search above and press return to search.
ట్యాక్సీవాలా ఫస్ట్ గేర్ వేసేశాడు
By: Tupaki Desk | 23 March 2018 12:53 PM GMTఅర్జున్ రెడ్డిగా యూత్ లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న విజయ్ దేవరగొండ.. తన తర్వాతి సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుని మరీ చేసిన మూవీ ట్యాక్సీ వాలా. కొన్ని వారాల క్రితం ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసిన ఈ చిత్రానికి.. ఇప్పుడు టీజర్ ను కూడా ఇచ్చేశారు. అయితే.. ఇది టీజర్ మాదిరిగా అనిపించలేదు. కేవలం హీరోను.. ట్యాక్సీని మాత్రం ఇంట్రడ్యూస్ చేశారంతే. బహుశా అందుకే కాబోలు.. టీజర్ అనే పదం వాడకుండా ట్యాక్సీవాలా ఫస్ట్ గేర్ అనే పేరు పెట్టారు.
ట్యాక్సీవాలా ఫస్ట్ గేర్ వేసుకుని రోడ్డు మీద రయ్ రయ్ మని దూసుకుపోవడం.. సినిమాటిక్ స్టయిల్లో టర్నింగులు తిప్పడం.. కారు డ్రైవ్ చేస్తున్న విజయ్ దేవరకొండ స్టైలిష్ లుక్ తో కనిపించడం.. చివరగా కారు మీద విజయ్ దేవరకొండ ఇన్ అండ్ యాజ్ ట్యాక్సీవాలా అనే టైటిల్ ను డిస్ ప్లే చేయడం.. ఫస్ట్ గేర్ లో చూపించన మ్యాటర్ ఇదే. హీరో పాత్ర గురించి ఇప్పటికే క్లారిటీ ఉండగా ఇప్పుడు ట్యాక్సీ తోలుతున్న విజయ్ దేవరకొండను చూపించేందుకే ఈ టీజర్ ఇచ్చారని అనిపిస్తుంది.
అయితే.. ఇదే టీజర్ లో ఓ చిన్నపాటి లింక్ కూడా ఇచ్చారు. హీరో డ్రైవ్ చేస్తున్న ట్యాక్సీ వైట్ కలర్ లో ఉంటే.. అదే కారుతో సమానంగా బ్లాక్ కలర్ కారును మార్చి మార్చి చూపించారు. వైట్ కారులో విజయ్ దేవరకొండ కనిపిస్తే.. చివరలో కూడా బ్లాక్ కలర్ కారుపై టైటిల్ వేశారు. ఇందుకు కారణం ఏంటో తెలియాలంటే ఇంకా కొంత టైం పడుతుందిలే.
వీడియో చూడటానికి క్లిక్ చేయండి