Begin typing your search above and press return to search.

వీకెండ్ కలెక్షన్: టాక్సీ రైడింగ్ సేఫ్

By:  Tupaki Desk   |   19 Nov 2018 8:04 AM GMT
వీకెండ్ కలెక్షన్: టాక్సీ రైడింగ్ సేఫ్
X
ఒకపక్క లీకేజీ గొడవ మరోపక్క పైరసీ ప్రింటు రివ్యూల గోలతో రిలీజ్ కు ముందే సతమతమైన టాక్సీవాలా మొత్తానికి సేఫ్ గేమ్ ఆడుతూ సాఫీ జర్నీని కొనసాగిస్తున్నాడు. శనివారం విడుదల కావడంతో వీకెండ్ కేవలం రెండు రోజులే రావడం ఫిగర్స్ మీద కొంత ప్రభావం చూపించినప్పటికీ ఓవరాల్ గా చూసుకుంటే టాక్సీవాలా రాబట్టిన మొత్తం చిన్నదేమీ కాదు. రెండు రోజులకు గాను 9 కోట్ల షేర్ ని దాటేసిన టాక్సీ స్పీడ్ ఇవాళ్టి నుంచి ఎలా ఉంటుంది అనే దాన్ని బట్టి ఫైనల్ స్టేటస్ ఆధారపడి ఉంటుంది. 2.0 వచ్చే వరకు పోటీ పెద్దగా లేదు కాబట్టి మంచి లాభాలను తీసుకురావడానికి ఇంత కన్నా ఛాన్స్ ఉండదు. ముఖ్యంగా ఏ సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ తో దూసుకుపోతున్న టాక్సీవాలా ప్రస్తుతానికి స్ట్రాంగ్ గా ఉన్నాడు. మౌత్ టాక్ బాగా హెల్ప్ అవుతోంది. ఇక ఏరియాల వారీగా చూసుకుంటే కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి

నైజామ్ - 2 కోట్ల 76 లక్షలు

సీడెడ్ - 80 లక్షలు

ఉత్తరాంధ్ర - 76 లక్షలు

గుంటూరు - 53 లక్షలు

ఈస్ట్ గోదావరి - 39 లక్షలు

వెస్ట్ గోదావరి - 35 లక్షలు

కృష్ణా - 52 లక్షలు

నెల్లూరు - 21 లక్షలు

ఎపి/తెలంగాణ 2 రోజుల మొత్తం షేర్ - 6 కోట్ల 32 లక్షలు

రెస్ట్ అఫ్ ఇండియా - 1 కోటి 5 లక్షలు

ఓవర్సీస్ - 1 కోటి 75 లక్షలు

ప్రపంచవ్యాప్తంగా 2 రోజుల షేర్ - 9 కోట్ల 12 లక్షలు

ఇంకో పది రోజుల దాకా మంచి రన్ దక్కించుకునే అవకాశం ఉంది కాబట్టి టాక్సీవాలా ఇప్పుడు పాతిక కోట్ల షేర్ ని టార్గెట్ గా పెట్టుకున్నాడు. గీత గోవిందం స్థాయిని చేరే ఛాన్స్ లేదనే చెప్పాలి. అది పూర్తి ఫామిలీ ఎంటర్ టైనర్ కాగా టాక్సీవాలా హారర్ జానర్ కావడంతో రిపీట్ ఆడియన్స్ పరంగా వెనుకబడే ఛాన్స్ ఉంది. అయినప్పటికీ అమ్మిన రేట్ల ప్రకారం చూసుకుంటే ఈ రన్ తో టాక్సీ సేఫ్ రైడింగ్ తో గమ్యం చేరుకుంటుంది. నోటా దెబ్బ నుంచి త్వరగా కోలుకుని మళ్ళి ట్రాక్ మీదకు వచ్చేస్తాను అని విజయ్ దేవరకొండ చెప్పిన మాట నిజమయ్యేలాగే ఉంది