Begin typing your search above and press return to search.

ప్రియాంక తాగితే మేకప్‌ మ్యాన్‌ కి చుక్కలట!

By:  Tupaki Desk   |   14 Nov 2018 10:50 AM GMT
ప్రియాంక తాగితే మేకప్‌ మ్యాన్‌ కి చుక్కలట!
X
విజయ్ దేవరకొండ తాజా చిత్రం 'టాక్సీవాలా' నవంబర్ 17 న ప్రేక్షకుల ముందుకు రానుంది. పైరసీ ప్రింట్ బయటకు వచ్చినా.. రిలీజ్ విషయంలో డిలే జరిగినా 'టాక్సీవాలా' టీమ్ తమ ప్రమోషన్స్ తో సినిమాపై హైప్ పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు. రీసెంట్ గా ప్రీ-రిలీజ్ ఈవెంట్ కూడా జరిపారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరయ్యి సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయడం జరిగింది.

ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన ప్రియాంక జవాల్కర్ ఇప్పటికే తన లుక్స్ తో ఆడియన్స్ ను ఆకట్టుకుంటోంది. మరాఠీ అమ్మాయి అయినా అనంతపూర్ లో పెరగడంతో తెలుగు చక్కగా మాట్లాడుతోంది. ఈ సినిమాలో ఒకచోట మందు కొట్టే సీన్ ఉండడంతో సహజత్వం కోసం మొదటిసారి మందు కొట్టానని చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా మరో ఇంటర్వ్యూలో అప్పుడు ఏం జరిగిందో వెల్లడించింది. ఒక సిన్నివేశంలో మత్తులో ఉన్నట్టుగా నటించాల్సి ఉందని.. సహజత్వం కోసం కొద్దిగానే తాగానని.. కానీ మొదటి సారి కావడంతో మత్తు దిగేవరకూ నవ్వుతూనే ఉన్నానని తెలిపింది. దీంతో మేకప్‌ మ్యాన్ తనను కంట్రోల్ చేసేందుకు చాలా ఇబ్బంది పడ్డారట.

ఇదిలా ఉంటే ప్రియాంక జవాల్కర్ గతంలో చాలా షార్ట్ ఫిలిమ్స్ లో నటించింది. కానీ తనకు సినిమా అవకాశాలు రాకపోవడంతో పైచదువులకోసం అమెరికా వెళ్ళిందట. కానీ అక్కడ చాలామంది షార్ట్ ఫిలిం లో యాక్ట్ చేశారు కదా అని గుర్తు పట్టేవారని కొంత మంది మాత్రం సినిమాలో హీరోయిన్ గా ఎందుకు ట్రై చేయాలనేది అడగడంతో మళ్ళీ ఇండియాకు తిరిగి వచ్చి అవకాశాల ప్రయత్నించానని తెలిపింది. ఇండియా కి తిరిగి వచ్చిన ఆరునెలల లోపే 'టాక్సీవాలా' సినిమాలో హీరోయిన్ గా అవకాశం వచ్చిందట. సినిమా విడుదల రెండేళ్ళు పట్టిందని కానీ ఈ సినిమా రిలీజ్ అయితే తనకు మంచి అవకాశాలు వస్తాయని నమ్మకంగా చెబుతోంది.