Begin typing your search above and press return to search.
టాక్సీవాలా: బీ డబ్స్ లో సెలబ్రేషన్స్ స్టార్ట్!
By: Tupaki Desk | 17 Nov 2018 1:46 PM GMTపార్టీ. ఈ పదం వినగానే ఏజ్ ఓల్డ్ కాంగ్రెస్ పార్టీ నుండి రీసెంట్ గా వచ్చిన తెలంగాణా జనసమితి వరకూ అన్నీ గుర్తు రావచ్చు. కానీ పార్టీకి మరో అర్థం కూడా ఉందిగా.. అదే సెలబ్రేషన్. విజయం సాధించినప్పుడు లేదా మన జీవితంలో ఏదైనా చెప్పుకోదగ్గ విశేషం ఉన్నప్పుడు పార్టీ ఇస్తాం. ఏవీ లేకపోయినా ఊరికే కూర్చొని పార్టీ చేసుకుంటాం అని కొంతమంది ఘనులు అనుకోవచ్చు.. అదీ నిజమే. అలాంటి మహానుభావులకు ఓ దణ్ణం!
సరే ఇప్పుడు పార్టీ టాపిక్ ఎందుకు వచ్చిందంటే.. 'టాక్సీవాలా' ఈరోజే రిలీజ్ అయింది. హిట్ టాక్ తెచ్చుకుంది. అంతే. మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ బీ-డబ్స్ రెస్టారెంట్ లో 'టాక్సీవాలా' టీమ్ అందరికీ ఈరోజు(అంటే శనివారం రాత్రి) ఓ పార్టీ ఇస్తున్నాడని విశ్వసనీయ వర్గాల సమాచారం. బీ-డబ్స్ అల్లు అర్జున్ కి చెందిన బిజినెస్ వెంచర్ అని తెలిసిందే కదా. మొదటి రోజు బ్లాక్ బస్టర్ అని పోస్టర్లు వేస్తారు..వీలైతే సక్సెస్ మీట్ పెడతారు. కానీ ఇలాంటి సెలబ్రేషన్ పార్టీ ఎందుకని మీకు అనుమానం రావొచ్చు.
ఇప్పటికే 'టాక్సీవాలా' పైరసీ ప్రింట్ ఆన్ లైన్ లో ఉంది. అయినా జనాలు దాన్ని పట్టించుకోకుండా చూడడం ఒక వండర్ అయితే.. సినిమాకు మంచి రివ్యూస్.. పాజిటివ్ మౌత్ టాక్ రావడం మరో గొప్ప విషయం. ఇప్పటిదాకా టాలీవుడ్ లో ఒక్క పవన్ సినిమా 'అత్తారింటికి దారేది' విషయంలోనే ఇలా జరిగింది. ఇక ఇప్పుడు టాలీవుడ్ సెన్సేషన్.. యూత్ లో క్రేజీ స్టార్ గా మారిన విజయ్ దేవరకొండ విషయంలో మరో సారి రిపీట్ అయింది. అది చాలదా పార్టీ ఇచ్చేందుకు? అయినా ఈ సినిమా అల్లు అర్జున్ హోమ్ బ్యానర్ లోనే కదా తెరకెక్కింది. మరి జోష్ ఉండదా?