Begin typing your search above and press return to search.
ఓవర్సీస్ లో దేవరకొండ మళ్లీ సందడి
By: Tupaki Desk | 18 Nov 2018 7:08 AM GMTవిజయ్ దేవరకొండ మరోసారి తన సత్తా చాటాడు. ‘అర్జున్ రెడ్డి’, ‘గీత గోవిందం’ చిత్రాలతో ఓవర్సీస్ బాక్సాఫీస్ వద్ద సందడి చేసిన విజయ్ దేవరకొండ మరోసారి అక్కడ హవా కొనసాగిస్తున్నాడు. నిన్న ‘ట్యాక్సీవాలా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్ దేవరకొండ మంచి ఓపెనింగ్స్ ను అక్కడ రాబట్టాడు. సినిమా ముందే లీక్ అవ్వడం, పలు రీ షూట్ లు జరపడం, వాయిదాల మీద వాయిదాలు పడటం వల్ల సినిమాపై కాస్త నెగిటివ్ ఇంప్రెషన్ పడటం జరిగింది. దాంతో ఓవర్సీస్ లో కాస్త ఆసక్తి తగ్గింది. అయితే సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చిన నేపథ్యంలో ఓవర్సీస్ లో మంచి వసూళ్లు దక్కించుకుంటుంది.
‘ట్యాక్సీవాలా’ ఓవర్సీస్ ప్రీమియర్ 1.15 లక్షల డాలర్ల గ్రాస్ ను దక్కించుకుంది. ఈ చిత్రానికి పోటీ పెద్దగా లేక పోవడంతో సునాయాసంగా హాఫ్ మిలియన్ మార్క్‌ను చేరుకోబోతున్నట్లుగా ట్రేడ్ వర్గాల వారు అంటున్నారు. లాంగ్ రన్‌లో ఈ చిత్రం 7.5 లక్షల డాలర్ల వరకు దక్కించుకుంటుందని అంటున్నారు. ట్యాక్సీవాలాపై మొదటి నుండి ఉన్న లో బజ్ కారణంగా భారీ బిజినెస్ ఓవర్సీస్ లో చేయలేదు. అందుకే అక్కడ 7.5 లక్షల డాలర్లు వచ్చినా కూడా లాభమే అన్నట్లుగా ట్రేడ్ వర్గాల వారు అంటున్నారు. విజయ్ దేవరకొండ తన క్రేజ్ తో మరోసారి బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నాడు. మరో వైపు తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి ఓపెనింగ్స్ ను రాబట్టినట్లుగా తెలుస్తోంది. 2.ఓ చిత్రం విడుదలయ్యే వరకు ట్యాక్సీవాలా జోరుగా రైడ్ కొనసాగించే అవకాశం ఉంది.