Begin typing your search above and press return to search.
టీజర్ టాక్: థ్రిల్లింగ్ ట్యాక్సీ
By: Tupaki Desk | 18 April 2018 1:52 PM GMTఅర్జున్ రెడ్డి తర్వాత భారీ అంచనాలతో వస్తున్న విజయ్ దేవరకొండ ట్యాక్సీ వాలా టీజర్ విడుదలైంది. కథ దేని గురించి అనే క్లూ ఏ మాత్రం ఇవ్వకుండా చాలా ఇంటెలిజెంట్ గా కట్ చేసిన ఈ టీజర్ లో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ చాలానే ఉన్నాయి. హాస్పిటల్ వాతావరణం-లిఫ్ట్ స్పేస్ లో వేలాడుతున్న ఒక మనిషి-ఆందోళనలో ఉన్న కొందరు వ్యక్తులు-టీవీ వాయిస్ ఓవర్ లో ఏదో ప్రయోగం చేయబోయి కుటుంబాన్ని పోగొట్టుకున్న యువకుడు అంటూ ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా అసలు సినిమా దేని గురించా అని ఆలోచించేలా దర్శకుడు రాహుల్ సంక్రిత్యాన్ దీన్ని కట్ చేయించిన తీరు నిజంగా వెరైటీగా ఉంది. లుక్ పరంగా అర్జున్ రెడ్డి కి దీనికి చాలా మార్పు చూపించిన విజయ్ దేవరకొండ కండలు పెంచడం ఇందులో స్పెషల్ అట్రాక్షన్.
తన మొదటి సినిమానే అయినప్పటికీ రాహుల్ వినూత్నమైన సబ్జెక్టును ఎంచుకున్న తీరు ఆసక్తి కలిగేలా చేస్తోంది. సరదాగా జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్న యువకుడికి ట్యాక్సీకి సంబంధం ఏమిటి-అతను డ్రైవర్ గా ఎందుకు మారాల్సి వచ్చింది – మొదట్లో చెప్పిన ప్రయోగానికి కథలో హీరో హీరొయిన్లకు సంబంధం ఏమిటి అనే కోణంలో ప్రతిది ఇందులో ఆసక్తికరంగానే ఉంది. మొత్తానికి విజయ్ దేవరకొండ రొటీన్ ఉచ్చులో పడకుండా చాల డిఫరెంట్ సబ్జెక్ట్ నే ఎంచుకున్నట్టు కనిపిస్తోంది. జేక్స్ బెజోయ్ మ్యూజిక్ బాగా ఎలివేట్ అయ్యింది. కాకపోతే హీరొయిన్స్ ప్రియాంకా జవల్కర్-మాళవిక నాయర్ లను మాత్రం చూపించీ చూపించకుండా తెలివిగా మేనేజ్ చేసారు. యువి-గీతా లాంటి భారీ నిర్మాణ సంస్థల నిర్మాణం కనక ఆ విషయంలో దేనికి లోటు చేయనట్టే. మొత్తానికి అర్జున్ రెడ్డి ట్యాక్సీ వాలాగా మారి తన మీద ఆసక్తిని టీజర్ తో రెట్టింపు చేసుకున్నాడు.
వీడియో కోసం క్లిక్ చేయండి