Begin typing your search above and press return to search.

రికార్డులను దున్నేస్తున్న స్విఫ్ట్

By:  Tupaki Desk   |   1 Sep 2017 9:50 AM GMT
రికార్డులను దున్నేస్తున్న స్విఫ్ట్
X
టేలర్ స్విఫ్ట్ మళ్లీ సెన్సేషన్ సృష్టించేస్తోంది. రీసెంట్ గా రిలీజ్ అయిన "లుక్ వాట్ యు మేడ్ మి డు" సింగిల్ యూట్యూబ్ ను షేక్ చేసేస్తోంది. హారర్ థీమ్ తో రూపొందిన ఈ మ్యూజిక్ వీడియోకు.. ఆడియన్స్ నుంచి విపరీతమైన ఆదరణ లభిస్తోంది. ఐదంటే ఐదు రోజుల్లో ఏకంగా 107 మిలియన్ల వ్యూస్ వచ్చాయంటే.. టేలర్ స్విఫ్ట్ సంచలనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో అర్ధమవుతుంది.

యూట్యూబ్ లాంఛింగ్ లలో అతి పెద్ద రికార్డ్ ను టేలర్ స్విఫ్ట్ ఈ వీడియో సొంతం చేసేసుకుంది. రిలీజ్ అయిన 24 గంటల వ్యవధిలోనే 43.2 మిలియన్ల మంది ఈ వీడియోను చూసేశారు. దీంతో గత రికార్డులన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. ఇప్పటివరకూ సై జంటిల్ మ్యాన్ పేరిట ఈ రికార్డ్ ఉంది. గతంలో ఈ వీడియో 24 గంటల వ్యవధిలో 36 మిలియన్ల వ్యూస్ సాధించగా.. ఈ రికార్డును పెద్ద మార్జిన్ తో ఓవర్ టేక్ చేసేసింది టేలర్ స్విఫ్ట్ సింగిల్ లుక్ వాట్ యు మేడ్ మి డు. తనపై వస్తున్న విమర్శలకు ఒక్క సింగిల్ తోనే సమాధానం ఇఛ్చిన టేలర్ స్విఫ్ట్.. జస్టిన్ బైబర్ డెస్పాసిటో డెస్పాసిటో రికార్డ్ 22 మిలియన్ల్.. అడెల్ హెలో రికార్డ్ 27 మిలియన్లను ఈజీగా క్రాస్ చేసేసింది.

ఒక్క యూట్యూబ్ లోనే కాదు.. అన్ని ప్లాట్ ఫామ్స్ లోనూ ఇప్పుడు ఈ వీడియోనే టాప్ ట్రెండింగ్ అయిపోయింది. స్పాటిఫై లో 23 మిలియన్ సార్లు ఈ పాట స్ట్రీమ్ కాగా.. మొదిట మూడు రోజుల్లోనే 2.5 లక్షల డౌన్ లోడ్ సేల్స్ జరిగాయి. యాపిల్ మ్యూజిక్.. స్పాటిఫై యూఎస్.. గ్లోబల్ టాప్ 50.. అమెజాన్ మ్యూజిక్ ఛార్టులలో ప్రస్తుతం "లుక్ వాట్ యు మేడ్ మి డు" టాప్ లో ఉండడం విశేషం.