Begin typing your search above and press return to search.

లక్ష్మీస్ ఎన్టీఆర్ మీద కేసులు షురూ

By:  Tupaki Desk   |   12 March 2019 11:14 AM GMT
లక్ష్మీస్ ఎన్టీఆర్ మీద కేసులు షురూ
X
ఊహించినట్టే లక్ష్మీస్ ఎన్టీఆర్ మీద కేసుల రగడ మొదలైంది. స్వయానా వర్మే ఈ విషయాన్ని పేర్కొంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం గమనార్హం. దేవీబాబు చౌదరి అనే టిడిపి కార్యకర్త కేంద్ర ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు చేసాడు. దాని సారాంశం ప్రకారం లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో చంద్రబాబు నాయుడు పాత్రను చాలా నెగటివ్ గా చూపించారని దాని వల్ల ఓటర్లపై ప్రభావం పడుతుందని అందులో పేర్కొన్నాడు.

కాబట్టి తొలి విడత పోలింగ్ అయ్యే వరకు లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదల ఆపాల్సిందిగా అందులో అభ్యర్థించాడు. ఈ మొత్తం మ్యాటర్ ని వర్మ స్వయంగా షేర్ చేసుకోవడం విశేషం. ఈ మ్యాటర్ ని ఎన్నికల సంఘం ఏ కోణంలో చూస్తుంది అనే దాన్ని బట్టి తదుపరి పరిణామాలు ఉంటాయి. అయితే నేను వీటికి భయపడే టైపు కాదని వర్మ ఇంతకు ముందే చెప్పాడు. ఒకవేళ తనను చంపినా యుట్యూబ్ లో పెట్టమని ఒకరికి చెప్పానని ఇంటర్వ్యూలో చెప్పి సంచలనం రేపాడు.

మరి నిజంగానే ఎన్నికల కమీషనో లేదా కోర్టో అడ్డుకుంటే ఆన్ లైన్ లో ఫ్రీగా పెట్టేస్తాడా అనేది అనుమానమే. ఎందుకంటే థియేట్రికల్ బిజినెస్ కు సంబంధించి డీల్స్ అన్ని పూర్తయ్యాయి. బయ్యర్ల పేర్లు సైతం వర్మ కొందరివి ప్రకటించాడు. సో ఇలా కేసులు పడతాయని తెలిసే వర్మ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశాడు అంటే ఇప్పుడు జరుగుతున్న జరగబోయే సంఘటనలకు ముందుగా ప్రిపేర్ అయినట్టేగా. మరి లక్ష్మీస్ ఎన్టీఆర్ విషయంలో వర్మ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతోందో అని వర్మ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. మనకైనా అంతకు మించిన ఆప్షన్ ఏముంది