Begin typing your search above and press return to search.
దాడికి ప్రతిదాడి వర్మ సమాధానం
By: Tupaki Desk | 26 Dec 2018 4:28 PM GMTదాడికి ప్రతిదాడి చేయడం శత్రువును మట్టుపెట్టడమే మగతనం! అని సినిమాల్లో చూపించడమే కాదు - ప్రాక్టికల్ గానూ చేసి చూపిస్తున్నాడు ఆర్జీవీ. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో తాను చూపించేది మాత్రమే వాస్తవం అని - ఎన్టీఆర్ జీవితంలోని వాస్తవాల్ని తాను మాత్రమే చూపించగలనని ప్రకటించాడు వర్మ. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం కోసం రూపొందించిన వెన్నుపోటు టీజర్ పెను సంచలనమైన సంగతి తెలిసిందే. ఈ పాటలో కుట్ర, వెన్నుపోటు అంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఫోటోల్ని పదే పదే చూపించారు. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచినది చంద్రబాబు అనే అర్థాన్ని వచ్చేలా ఈ గీతాన్ని రూపొందించాడు. వివాదాలతో ప్రచారం ఎత్తుగడ పెద్ద ఎత్తున పారింది. లక్ష్మీస్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఓ సంచలనంగా మారింది.
దీంతో పాటు ఈసారి మరికాస్త సంక్లిష్టమైన వివాదాల్నే ఆర్జీవీ నెత్తికెత్తుకున్నాడు. అతడిపై ఎస్వీ మోహన్ రెడ్డి అనే ఎమ్మెల్యే కర్నూల్ టూటౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టిన సంగతి తెలిసిందే. కేసు వేయడమే కాదు - మీడియా ముందు కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దీంతో ఆ వ్యాఖ్యలకు తాను హర్టయ్యానని గొడవకు దిగిన వర్మ మోహన్ రెడ్డికి లీగల్ నోటీసులు పంపించారు. ఆర్జీవీ లాయర్ ప్రభాకర్ శ్రీపాద ఈ నోటీసుల్ని పంపించారు. సమాజంలో మంచి పేరు ప్రతిష్ఠలు ఉన్న వర్మ ఇప్పటికే 50 సినిమాలు తీశారు. ఆయన టీజర్ లో ఎవరినీ అవమానించక ముందే తన క్లయింట్ పై కేసు పెట్టడం తగదని - అందుకు భేషరతుగా బహిరంగ క్షమాపణలు చెప్పాలని, ఆ లీగల్ నోటీసులో డిమాండ్ చేశారు.
ఇదే విషయాన్ని వర్మ ఖరాకండిగా చెబుతున్నారు. తేదేపా వర్గాలు ఆరోపిస్తున్నట్టు తాను ఎవరినీ కించపరచలేదని వర్మఅంటున్నారు. నేను నిజాలు చూపిస్తుంటే ఎందుకిలా నిందలు వేస్తారని ప్రత్యారోపణలు చేశారు. మొత్తానికి లక్ష్మీస్ ఎన్టీఆర్ చట్టపరమైన వివాదాల్లోకి వస్తోంది. దాడికి ప్రతిదాడి సమాధానం అన్న తీరుగా ఆర్జీవీ వ్యవహరిస్తున్నారు. ఇది ఎంతవరకూ వెళుతుందో!?