Begin typing your search above and press return to search.
బెట్టింగ్: తమిళ రాకర్స్ లీక్ చేస్తారా?
By: Tupaki Desk | 28 Nov 2018 4:56 PM GMT2.ఓకి టెన్షన్ టెన్షన్. 600కోట్ల పచ్చనోట్లు కళ్ల ముందు కనిపిస్తున్నాయి. రిలీజ్ కి ఇంకొన్ని గంటలే సమయం ఉంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మెట్రో నగరాలు సహా సింగిల్ థియేటర్లలో 3డిలో సినిమాని వీక్షించేందుకు ప్రేక్షకులు టిక్కెట్లు బుక్ చేసుకుని మరీ వేచి చూస్తున్నారు. అయితే ఇక్కడే ఉందో చిక్కు. ఈ సినిమాని రిలీజ్ డే రోజునే లీక్ చేసేస్తామంటూ తమిళ్ రాకర్స్ హెచ్చరించిన సంగతి తెలిసిందే.
ఆ హెచ్చరిక లైకా ప్రతినిధుల్లో ఒకటే టెన్షన్ క్రియేట్ చేస్తోందట. తమిళ్ రాకర్స్ పైరసీ మాఫియాని పట్టేసేందుకు .. ఆన్ లైన్ లో టొరెంట్ లింకులు తొలగించేందుకు కొన్ని టెక్నికల్ టీమ్ లు అదే పనిగా వల పన్ని వెయిట్ చేస్తున్నాయట. సినిమా రిలీజైన దగ్గర నుంచి ఆ లింకుల్ని బ్లాక్ చేసేందుకు శతవిధాలా పోరాటం చేసేందుకు టెక్ టీమ్ లు రెడీగా ఉన్నాయట. దాదాపు 600 కోట్ల బడ్జెట్ వెచ్చించి తెరకెక్కించిన ఈ సినిమాని ఆన్ లైన్ లో లీక్ చేస్తామంటూ చాలా సీరియస్ గా హెచ్చరించడంతో శంకర్ - రజినీ - లైకా సుభాష్ కరణ్ ఎంతో టెన్షన్ పడుతున్నారన్న మాటా వినిపిస్తోంది.
మొన్న హైదరాబాద్ ప్రెస్ మీట్ లోనూ దర్శకుడు శంకర్ మీడియాని ఇదే విషయంపై ప్రాధేయ పడ్డారు. వందల మంది ఈ సినిమాకి పని చేశారు. ఎందరో టాప్ టెక్నీషియన్స్ ఎన్నో రోజుల పాటు టన్నుల కొద్దీ చెమటోడ్చి ఈ సినిమా కోసం కష్టపడ్డారు. వారి శ్రమ వృధా కాకుండా ఉండాలంటే ఇలాంటి సినిమాని ప్రోత్సహించండి అని కోరారు. ముఖ్యంగా అన్ని మీడియాల్లో జరుగుతున్న నెగెటివ్ ప్రచారంపైనా ఆయన కాస్త ఆందోళనగానే ఉన్నారన్న సంగతి అప్పుడు అందరికీ అర్థమైంది. అలాగే ఈ చిత్రాన్ని 3డిలో చూస్తే 2డిలో చూసిన దానికంటే పది రెట్లు బెటర్ విజువల్ ఎక్స్ పీరియెన్స్ ని ఆస్వాధిస్తారని శంకర్ అన్నారు. 2.ఓ టీమ్ ఇంత టెన్షన్‌లో ఉంటే ఈ టెన్షన్ కి తమిళ్ రాకర్స్ అదనపు టెన్షన్ గానూ మారారు. పైరసీ చేయడంలో తమిళ తంబీ మాఫియాని కొట్టే వాళ్లే లేరన్న టాక్ బయట ఉంది. చెన్నయ్ - దుబాయ్ - శ్రీలంక కేంద్రంగా పైరసీ మాఫియాలు చెలరేగిపోతాయని - పల్లెటూళ్ల థియేటర్ల నుంచి లీక్ చేస్తున్నారా? లేక దుబాయ్ - యుఏఈ లాంటి దేశాల నుంచి లీక్ చేస్తున్నారా? అన్నది అర్థం కాని ఫజిల్ అని చెబుతున్నారు. ఈసారి 2.ఓ చిత్రాన్ని దుబాయ్ నుంచి పైరసీ చేసే ఆస్కారం ఉందని అక్కడా లోకల్ పోలీస్ సాయంతో కొన్ని సైబర్ క్రైమ్ బృందాలు సెర్చ్ కి సిద్ధమయ్యాయని తెలుస్తోంది. ఇకపోతే ఇప్పటికే సర్కార్ సహా ఇటీవల రిలీజైన ఎన్నో సినిమాల్ని తమిళ్ రాకర్స్ పైరసీలో లీక్ చేసిన సంగతి తెలిసిందే. 2.ఓ చిత్రాన్ని తమిళ్ రాకర్స్ లీక్ చేస్తుందా? అంటూ దీనిపై యూత్ లో బీటెక్ బాబుల్లో బెట్టింగులు నడుస్తున్నాయన్నది మరో రిపోర్ట్.