Begin typing your search above and press return to search.
డైలమాలో 'ఆచార్య'..?
By: Tupaki Desk | 31 July 2021 5:32 AM GMTమెగాస్టార్ చిరంజీవి - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న తాజా చిత్రం ''ఆచార్య''. మొదటిసారి చిరు - చరణ్ ఫుల్ లెన్త్ రోల్స్ చేస్తున్న ఈ సినిమా కోసం మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. కొణిదెల ప్రొడక్షన్స్ సమర్పణలో మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. మరికొన్ని రోజుల్లో చిత్రీకరణ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ లోకి ఎంటర్ అవనుంది. అయితే ఈ సినిమా విడుదల తేదీపై మాత్రం క్లారిటీ రావడం లేదు.
నిజానికి 'ఆచార్య' చిత్రాన్ని సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ముందుగా ప్లాన్ చేసుకున్నారు. అయితే కోవిడ్ సెకండ్ వేవ్ ప్రభావంతో షూటింగ్ నిలిచిపోవడంతో విడుదల వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు తదుపరి రిలీజ్ డేట్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎందుకంటే దసరా - సంక్రాంతి వంటి ఫెస్టివల్ సీజన్ డేట్స్ ఆల్రెడీ బ్లాక్ చేసి పెట్టుకున్నారు. ఎన్టీఆర్ - రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కిస్తున్న 'ఆర్ ఆర్ ఆర్' చిత్రాన్ని దసరా సందర్భంగా అక్టోబర్ 13న రిలీజ్ చేస్తుండటంతో.. దరి దాపుల్లో మరో సినిమాని తీసుకొచ్చే సాహసం ఎవరూ చేయలేరు.
దీపావళికి రజనీకాంత్ 'అన్నాత్తే' తో పాటుగా మరికొన్ని మీడియం రేంజ్ సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. 'ఆచార్య' చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని ఆ మధ్య వార్తలు వచ్చాయి. అయితే పెద్ద పండుగ పందెం కోసం ఇప్పటికే మూడు భారీ చిత్రాలు రెడీ అయ్యాయి. మహేష్ బాబు 'సర్కారు వారి పాట' - పవన్ కళ్యాణ్ - రానా కలిసి నటిస్తున్న '#PSPKRana' - ప్రభాస్ 'రాధే శ్యామ్' చిత్రాలను సంక్రాంతి కోసం లాక్ చేసి పెట్టారు. 'ఎఫ్ 3' చిత్రాన్ని కూడా అదే సీజన్ లో తీసుకురానున్నట్లు వెంకటేష్ హింట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో 'ఆచార్య' కు అప్పుడు రిలీజ్ డేట్ దొరకడం కష్టమే. ఈ నేపథ్యంలో మెగా మల్టీస్టారర్ కు ఫెస్టివల్ సీజన్ దొరకడం లేదని అభిమానులు కాస్త టెన్షన్ పడుతున్నారు.
మెగాస్టార్ బర్త్ డే వీకెండ్ లో రిలీజ్ చేసే అవకాశాలు లేకపోలేదని టాక్ ఉంది. కాకపోతే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్
చేయాలి కాబట్టి, అప్పటికి సినిమా రెడీ అవ్వడం సాధ్యంకాని పని. వినాయక చవితి సందర్భంగా 'లవ్ స్టోరీ' 'టక్ జగదీష్' 'అఖండ' వంటి సినిమాలు రావాలని చూస్తున్నాయి. సెప్టెంబర్ 10వ తేదీని 'లవ్ స్టోరీ' ఆల్రెడీ లాక్ చేసిందనే టాక్ వినిపిస్తోంది. క్రిష్మస్ కానుకగా 'ఏజెంట్' వంటి చిత్రాలతో పాటుగా 'పుష్ప 1' చిత్రాన్ని రిలీజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయని అంటున్నారు. ఇవన్నీ చూసుకుంటే 'ఆచార్య' ఆగమనం ఎప్పుడు ఉంటుందా అనే ఉత్కంఠ అందరిలో ఉంది. పండుగ సీజన్లు ఖాళీగా లేవు కనుక ఏదొక నార్మల్ వీకెండ్ లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తారేమో చూడాలి. త్వరలోనే మేకర్స్ దీనిపై ఓ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.
కాగా, సామాజిక అంశాలకు తనదైన శైలిలో కమర్షియల్ హంగులు జోడించి 'ఆచార్య' చిత్రాన్ని రూపొందిస్తున్నారు కొరటాల. 'భరత్ అనే నేను' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఆయన నుంచి వస్తున్న సినిమా ఇదే. ఇందులో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా.. రామ్ చరణ్ కు జోడీగా పూజాహెగ్డే కనిపించనుంది. ఈ చిత్రానికి సంగీత బ్రహ్మ మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు. సురేష్ సెల్వరాజన్ ప్రొడక్షన్ డిజైనర్ గా వర్క్ చేస్తుండగా.. తిరు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.