Begin typing your search above and press return to search.
వీడియో : మెగాస్టార్ సక్సెస్ ను సెలబ్రేట్ చేసిన అక్కినేని 'ఏజెంట్'
By: Tupaki Desk | 9 March 2022 3:30 PM GMTఅక్కినేని ప్రిన్స్ అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'ఏజెంట్'. ఈ సినిమా పై అక్కినేని ఫ్యాన్స్ తో పాటు ప్రతి ఒక్కరిలో ఆసక్తి నెలకొంది. మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సినిమా తర్వత అఖిల్ నుండి రాబోతున్న సినిమా కావడంతో సహజంగానే అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా ఈ సినిమా ఉంటుందనే నమ్మకంను దర్శకుడు సురేందర్ రెడ్డి కలిగిస్తున్నాడు.
ఇప్పటికే విడుదల అయిన ఫస్ట్ లుక్ మరియు గ్లిమ్స్ తో సినిమా పై అంచనాలు మరింత పెరిగాయి. తాజాగా ఈ సినిమాలో మలయాళ మెగా స్టార్ మమ్ముట్టీ ని కీలక పాత్రలో నటింపజేయబోతున్నట్లు గా ప్రకటించారు. దాంతో సినిమా గురించి పెద్ద ఎత్తున చర్చ మొదలు అయ్యింది. ఈ సమయంలోనే మెగాస్టార్ మమ్ముట్టీ నటించిన భీష్మ పర్వం సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.
మలయాళంలో రూపొంది భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం మాత్రమే కాకుండా ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన భీష్మ పర్వం సినిమా సక్సెస్ ను ఏజెంట్ చిత్ర యూనిట్ సభ్యులు సెలబ్రేట్ చేసుకున్నారు. షూటింగ్ లో భాగంగా మమ్ముట్టీ 'ఏజెంట్' చిత్రం సెట్ కు వచ్చాడు. ఆ సమయంలో ఏజెంట్ హీరో అఖిల్ మరియు దర్శకుడు సురేందర్ రెడ్డి లు కలిసి భీష్మ పర్వం సక్సెస్ కేక్ ను కట్ చేయించారు.
అఖిల్ మరియు మమ్ముట్టీ ల కాంబోలో వచ్చే సన్నివేశాలు అద్బుతంగా ఉంటాయంటూ యూనిట్ సభ్యులు చెబుతున్నారు. సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. దాంతో విడుదల విషయంలో క్లారిటీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇదుగో అదుగో అంటూ వాయిదాల మీద వాయిదాలు వేస్తూ వచ్చిన షూటింగ్ ను ఈ సమ్మర్ కు పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి. కనుక సినిమా ను ఇదే ఏడాదిలో విడుదల చేస్తారని అంటున్నారు.
అఖిల్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ ఒక మోస్తరుగా ఆకట్టుకుంది. కాని ఇప్పటి వరకు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ను అందుకోలేదు. కనుక ఈ సినిమా ఆయనకు మంచి విజయాన్ని తెచ్చి పెడుతుందనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు. తెలుగు తో పాటు మలయాళంలో కూడా ఈ సినిమాను భారీ ఎత్తున విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మెగాస్టార్ మమ్ముట్టీ వల్ల మలయాళంలో ఈ సినిమాకు మంచి బిజినెస్ జరిగే అవకాశాలు ఉన్నాయి.