Begin typing your search above and press return to search.
హీరోయిన్ తో టీమిండియా స్టార్ క్రికెటర్ వెడ్ లాక్
By: Tupaki Desk | 2 Dec 2022 3:00 AM GMTబాలీవుడ్ బ్యూటీ స్టార్ అథియా శెట్టి .. స్టార్ క్రికెటర్ KL రాహుల్ ల మధ్య ప్రేమ వ్యవహారం అందరికీ తెలిసినదే. ఈ జంట ఒకరిని వీడి ఒకరు ఉండలేరు. గత కొంతకాలంగా వీరి పెళ్లికి ఏర్పాట్లు సాగుతున్నాయని కూడా టాక్ వినిపించింది. టీమిండియా ఓపెనర్ రాహుల్ 2018 నుండి అథియాతో డేటింగ్ చేస్తున్నాడు. ఇటీవల ఆథియా తండ్రి సునీల్ శెట్టి కూడా వారు అతి త్వరలో పెళ్లి చేసుకుంటారని ధృవీకరించారు. ఈ జంట త్వరలో వారి సంబంధాన్ని తదుపరి స్థాయికి తీసుకువెళుతోందనేది తాజా వార్త.
తాజా సమాచారం మేరకు.. పెళ్లి జనవరి మొదటి వారంలో జరగనుంది.ఆ మేరకు నేరుగా బీసీసీఐ నుంచే ఒక ఆసక్తికర ప్రకటన వెలువడింది. వ్యక్తిగత పని ఏంటో కూడా బహిర్గతం చేయకుండా 'పర్సనల్ వర్క్' కోసం KL రాహుల్ సెలవును BCCI ఆమోదించినట్టు పేర్కొంది. అయితే అది అథియాతో పెళ్లి కోసమేనని అంతా భావిస్తున్నారు.
ఈ జంట ఘనమైన పెళ్లి ఎప్పుడు ఎక్కడ జరుగుతుందో త్వరలో వెల్లడి కానుంది. సరైన సమయంలో అందరికీ పెళ్లి గురించిన వివరాలు తెలుస్తాయని నేను భావిస్తున్నాను!! అంటూ ప్రముఖ నటుడు ఓ మీడియా చిట్ చాట్ లో వెల్లడించడంతో ఈ పెళ్లి ఖాయమేనని భావిస్తున్నారు.
కొద్ది రోజుల క్రితం అథియా తండ్రి.. సూపర్ స్టార్ సునీల్ శెట్టి ఓ ఇంటర్వ్యూలో ఈ జంట వివాహం త్వరలో జరుగుతుందని చెప్పడంతో ఈ సెలవులు దానికోసమేనని క్లారిటీ వచ్చేసింది. టీమిండియా వైస్ కెప్టెన్ KL రాహుల్ T20 ప్రపంచ కప్ 2022 తర్వాత భారత న్యూజిలాండ్ పర్యటన కోసం రోహిత్ శర్మ - విరాట్ కోహ్లీ వంటి ఇతర సీనియర్ ఆటగాళ్లతో పాటు విశ్రాంతి తీసుకున్నారు. ఇప్పుడు రాహుల్ జనవరిలో శ్రీలంకతో జరిగే హోమ్ అసైన్ మెంట్ ను కోల్పోయే ఛాన్సుందని సమాచారం. 2023 జనవరిలో అతడు బాలీవుడ్ నటి అథియా శెట్టిని పెళ్లి చేసుకోబోతున్నాడు కనుక అతడికి టీమ్ లో చేరేందుకు వీలు పడదు.
రాహుల్ - అథియాల వివాహం గురించి పుకార్లు గత నాలుగేళ్లుగా వినిపిస్తూనే ఉన్నాయి. కొత్త సంవత్సరం (2023) ప్రారంభంలో భారత్ లో శ్రీలంకతో జరిగే సిరీస్ లో రాహుల్ ఆడటం లేదు. దానివల్ల BCCI అతడికి సెలవులను ఆమోదించారు. రాహుల్ బంగ్లాదేశ్ టూర్ నాటికి సునీల్ శెట్టి కుమార్తె అతియాను వివాహం చేసుకుంటాడు.
అయితే అతడు ఆ తర్వాత మరోసారి హనీమూన్ కోసం చిన్నపాటి విరామం తీసుకుంటాడని భావిస్తున్నారు. వివాహానంతరం రాహుల్ తన సహచర క్రికెటర్లతో కలిసి ఢాకాకు వెళతాడు. అక్కడ టీమిండియా 3 ODIలు ..2 టెస్ట్ మ్యాచ్ లు ఆడుతుంది. అయితే 2022 చివరి అసైన్ మెంట్ తర్వాత 29 ఏళ్ల రాహుల్ పూర్తిగా తన వ్యక్తిగత కార్యక్రమాలతో నిమగ్నమై ఉంటాడు. దీనర్థం పెళ్లి పనులతో బిజీ అవుతాడని భావించాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.