Begin typing your search above and press return to search.
సూపర్ స్టార్ 'లియో' కి హాలీవుడ్ టచ్
By: Tupaki Desk | 9 Jun 2023 11:00 PMయూనివర్శిల్ స్టార్ కమల్ హాసన్ తో విక్రమ్ సినిమా ను రూపొందించి బ్లాక్ బస్టర్ సక్సెస్ ను సొంతం చేసుకున్న దర్శకుడు లోకేష్ కనగరాజ్ ప్రస్తుతం సూపర్ స్టార్ విజయ్ తో లియో సినిమాని రూపొందిస్తున్న విషయం తెల్సిందే. పాన్ ఇండియా మూవీ గా రూపొందిస్తున్న ఈ సినిమా లో ఎంతో మంది స్టార్స్ కనిపించబోతున్నారు.
విజయ్ ను రెండు విభిన్నమైన పాత్రల్లో చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది. సినిమా ప్రకటించిన సమయం లో వచ్చిన టీజర్ సినిమా స్థాయి ని అమాంతం పెంచేసింది అనడం లో సందేహం లేదు. ఈ సినిమా లో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ నటిస్తున్నట్లుగా ఇప్పటికే ప్రకటన వచ్చింది. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ ప్రకటన వచ్చింది.
హాలీవుడ్ స్టార్ క్రిస్టోఫర్ నోలన్ రూపొందించిన టెనెట్ లో కీలక పాత్ర లో కనిపించిన డెంజిల్ స్మిత్ ను 'లియో' సినిమా కోసం సంప్రదించారని తెలుస్తోంది. సినిమా లోని కీలక పాత్ర కోసం ఆయన్ని ఎంపిక చేయడం దాదాపుగా కన్ఫర్మ్ అయ్యిందని కూడా వార్తలు వస్తున్నాయి.
లియో స్థాయి ని రోజు రోజు కు పెంచుతున్న దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఈసారి వెయ్యి కోట్ల క్లబ్ లో చేరేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. యూనివర్శిల్ స్టార్ కమల్ హాసన్ తో లోకేష్ కనగరాజ్ రూపొందించిన సినిమా అయిదు వందల కోట్ల వసూళ్లు సాధించింది. ఇప్పుడు వెయ్యి కోట్ల క్లబ్ పై లోకేష్ దృష్టి పెట్టాడు.