Begin typing your search above and press return to search.
విమర్శల పై రియాక్షన్ లేదేంటి పుష్పా?
By: Tupaki Desk | 5 Feb 2022 4:30 AM GMTఅల్లు అర్జున్ నటించిన పాన్ ఇండియా మూవీ `పుష్ప`. స్టార్ డైరెక్టర్ సుకుమార్ అత్యంత ప్రతిష్టాత్మంగా తెరకెక్కించిన ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా సంచలనాలు సృష్టిస్తోంది. వసూళ్ల పరంగా భారీ ఫిగర్ లని నమోదు చేసిన ఈ మూవీ దక్షిణాదిని మించి ఉత్తరాదిలో బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో వసూళ్లని రాబట్టి సరికొత్త రికార్డులు నమోదు చేసింది. ఉత్తరాదిలో ఏకంగా 100 కోట్లు వసూలు చేసి బాలీవుడ్ వర్గాలనే విస్మయానికి గురిచేసింది. శుక్రవారం 50 రోజులు పూర్తి చేసుకున్న ఈ మూవీ వరల్డ్ వైడ్ 365 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.
బన్నీ వన్ మ్యాన్ షోగా విడుదలై దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన ఈ మూవీపై ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అవధాన ప్రక్రియలో ప్రవచనాలు బోధిస్తూ సుప్రసిద్దులుగా పేరుగాంచిన ఆయనకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని అందించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గరికపాటి నరసింహారావు `పుష్ప` సినిమాపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
సినిమాలు సమాజాన్ని ప్రభావితం చేస్తాయని, అయితే కొన్ని చిత్రాలు సమాజానికి మంచి సందేశాన్నిచ్చేలా వుండటం లేదని వాపోయారు. అంతే కాకుండా `పుష్ప` సినిమా స్మగ్లింగ్ ని ప్రోత్సహించేలా వుందని, స్మగ్లర్ ను హీరోగా చిత్రీకరించడం ద్వారా వారు సమాజానికి ఎలాంటి సందేశాన్ని అందిస్తున్నారని, దీని ద్వారా వారు సమాజాన్ని కించ పరుస్తున్నారని, అలాగే ప్రజల అలోచనలని కలుషితం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. దీనిపై `పుష్ప` టీమ్ నుంచి ఎలాంటి రియాక్షన్ లేదు.
బన్నీ, సుకుమార్ `పుష్ప` సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్నారే కానీ ఈ సినిమాపై వస్తున్న విమర్శలపై మాత్రం స్పందించడం లేదు. అయితే అభిమానులు మాత్రం గరికపాటి గతంలో మాట్లాడిన మాటల్ని, మహిళలు పొట్టి దుస్తులు వేసుకుంటున్నారని వారిని విమర్శించిన తీరుని, అలాగే తనకు పద్మశ్రీ అవార్డు ప్రకటించిన వెంటనే గాయని చిన్మయి ట్వీట్ చేసి విమర్శించిన తీరుని హైలైట్ చేస్తూ పోస్ట్ లు పెడుతున్నారు.
అయితే `పుష్ప` టీమ్ వాదన మరోలా వుంది. గరికపాటి వ్యాఖ్యలపై స్పందించడం వల్ల తమకు కలిగే లాభం ఏమీ లేదని, దాని వల్ల అతనే ఇంకా ఫేమ్ అవుతాడని, అలా చేయడం కన్నా పార్ట్ 2 పనుల్లో బిజీగా వుండటం ఉత్తమమని చెబుతున్నారట. అయితే నెటిజన్స్ మాత్రం విమర్శలపై రియాక్షన్ లేదేంటి పుష్పా? అని కామెంట్ లు చేస్తున్నారు.